IPL 2026 Mini Auction: వచ్చే ఐపీఎల్‌లో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చే అవకాశం ఉంది. మినీ వేలం తరువాత టీమ్‌లో ఆటగాళ్లను బట్టి.. కొత్త కెప్టెన్ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కచ్చితంగా కెప్టెన్లను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సంజూ శాంసన్ రాజస్థాన్‌ను వీడడం దాదాపు ఖాయమైంది. ఏ టీమ్ కెప్టెన్‌ను మార్చే అవకాశం ఉందో ఇక్కడ చూద్దాం..
1/11వచ్చే సీజన్ ఐపీఎల్‌కు అన్ని టీమ్‌లు రెడీ అవుతున్నాయి. మినీ వేలానికి ముందు ప్లేయర్లపై ఓ అంచనాకు రానున్నాయి. కొన్ని టీమ్‌లు కెప్టెన్లను మార్చే అవకాశం ఉంది.
2/11సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను మార్చే అవకాశం లేదు. కమ్మిన్స్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ ఓసారి ఫైనల్స్‌కు చేరుకుంది. కమ్మిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌కు పూర్తి నమ్మకం ఉంది.
3/11ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఈ సీజన్‌లో పాండ్యా నాయకత్వంలో టాప్-4లో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కాదని.. పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
4/11కోల్‌కతా నైట్ రైడర్స్ వచ్చే సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానే స్థానంలో యువ కెప్టెన్‌ను ఎంపిక చేస్తారని అంటున్నారు. మినీ వేలం తరువాత కెప్టెన్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.
5/11ఎలాంటి అంచనాలు లేకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఎంపికైన రజత్ పాటిదార్.. తొలిసారి ట్రోఫీని అందించాడు. వచ్చే సీజన్‌కు కూడా రజత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
6/11శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా రాకతో పంజాబ్ కింగ్స్ టీమ్ జాతకం మారిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్.. స్పూర్తిదాయకమైన నాయకత్వంతో పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. వచ్చే ఏడాది కూడా అయ్యర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
7/11ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మినీ వేలం తరువాత ఢిల్లీ కూడా కెప్టెన్సీ విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
8/11రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలా.. వద్దా.. అని చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచిస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్‌ను టీమ్‌లోకి తీసుకుంటే అతడికే కెప్టెన్సీ కూడా అప్పగించే అవకాశం ఉంది. ఇతర స్టార్ ప్లేయర్లు ట్రేడ్ జరగకపోతే.. రుతురాజ్ కెప్టెన్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
9/11గుజరాత్ టైటాన్స్‌ను శుభ్‌మాన్ గిల్ మరోసారి నాయకుడిగా నడిపించనున్నాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ప్రమోట్ అయిన గిల్‌కు గుజరాత్‌కు నాయకత్వం వహించడం కలిసి వచ్చింది.
10/11లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు. కెప్టెన్‌గా.. ఆటగాడిగా పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. పంత్‌కు కెప్టెన్సీ ఒత్తిడిని తగ్గించి.. మరో ఆటగాడిని కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
11/11రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ మార్పు దాదాపు ఖాయమైంది. సంజూ శాంసన్ టీమ్‌ను వీడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రియాన్ పరాగ్ లేదా మరో స్టార్ ప్లేయర్‌ను మినీ వేలంలో తీసుకుని కెప్టెన్‌గా నియమించే ఛాన్స్ ఉంది. ఒకవేళ సంజూ టీమ్‌లోనే ఉంటే.. అతనే కెప్టెన్‌గా కొనసాగుతాడు.