iQOO Z10 5G Price Cut: iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్లో ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న పూర్తి ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
iQOO Z10 5G Price Cut: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇప్పుడు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సేల్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO మొబైల్స్‌పై అత్యంత ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా iQOOకు సంబంధించిన కొన్ని మొబైల్స్ పది నుంచి 40 శాతం వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ అత్యంత చీపు ధరకే లభించబోతోంది.
1/5ప్రస్తుతం అమెజాన్ లో iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఈ మొబైల్ ఏకంగా ఫ్లాట్ 15 శాతం వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
2/5ఈ iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ప్రజాధరణ పొందింది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ అమెజాన్‌లో చీప్ ధరకే లభిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర MRP ధర రూ.25,999గా ఉంది. కానీ, అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా.. 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ పోను కేవలం రూ. 21,999కే మొబైల్ పొందవచ్చు.
3/5ఇక ఈ మొబైల్‌పై ఆధారంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా SBI, ICICI, లేదా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ. 19,999కే లభిస్తుంది.
4/5ఇక ఈ iQOO Z10 5G మొబైల్‌పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ వినియోగించి మొబైల్ పొందాలనుకునే వారు తప్పకుండా మంచి బ్రాండెడ్ పాత మొబైల్లో ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను మొబైల్ ధర నుంచి తీసేస్తే..మీరు iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 1,399కే సొంతం చేసుకోవచ్చు.
5/5ఎక్స్చేంజ్ బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు మంచి కండిషన్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో ఎక్స్చేంజ్ చేస్తే ఈ మొబైల్ పై ఉన్న గరిష్ట ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. లేదంటే దీనిలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాపిల్ బ్రాండ్, సాంసంగ్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై ఎక్కువ బోనస్ లభిస్తుంది.