Udaya Bhanu: యాంకర్ ఉదయభాను కెరీర్‌ను నాశనం చేసింది వీళ్లే.. లిస్ట్‌లో స్టార్ సింగర్ పేరు..!

Udaya Bhanu Career: ఒకప్పుడు తెలుగు టెలివిజన్ ప్రపంచంలో.. అత్యంత ప్రాచుర్యం పొందిన యాంకర్‌గా.. పేరు తెచ్చుకున్నది ఉదయభాను. తన మాటల తీరుతో.. అందంతో ఉత్సాహభరితమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. అప్పట్లో ఆమెను జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవాళ్ళు.. మరి అలాంటి ఆమె బుల్లితెర నుంచి కనుమరుగు అవ్వడానికి కారణం ఎవరంటే..

1 /5

బుల్లితెర శ్రీదేవి అని అప్పట్లో యాంకర్ ఉదయభానుని అనేవారు. ఏ ప్రోగ్రాం అయినా ఆమె హాజరైతే చాలు..ఆ కార్యక్రమానికి ఉత్సాహం రెట్టింపు అవుతుందని చెప్పేవారు. ఒకప్పుడు సుమా కనకాల.. కంటే ఎక్కువ పేరు పొందిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.   

2 /5

అయితే‌..తన కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఉదయభాను ఒక్కసారిగా టెలివిజన్ రంగానికి దూరమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు అలా జరిగిందనే ప్రశ్నకు అనేక కథనాలు.. వాదనలు వినిపించాయి. అందులో ప్రధానంగా ఒక గాసిప్ మాత్రం ఎక్కువ చర్చకు దారి తీసింది..ఆమెకు సింగర్ సునీతతో విభేదాలు ఉన్నాయన్నది.  

3 /5

ఒక ఈవెంట్ సమయంలో ఉదయభాను సునీత వల్ల అవమానానికి గురయ్యారనే వార్తలు బయటకు వచ్చాయి. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో సునీత తనను పట్టించుకోలేదని..అందువల్ల తన మనసుకు బాధ కలిగిందని ఉదయభాను వ్యాఖ్యానించిందని ప్రచారం జరిగింది. 

4 /5

దాంతో సునీత కూడా ఈ విషయం మీద స్పందించి, “నేను ఆమెను ఎప్పుడూ అవమానించలేదు. ఆమెనే నాతో మాట్లాడటానికి దూరంగా ఉంటుంది. నేను ఆ కార్యక్రమానికి నిర్వాహకురాలు కాను. నిర్వాహకులు నన్ను పిలిచారు. ఉదయభాను స్టేజ్‌కి వెళ్తున్నప్పుడు ఒక బాధాకరమైన పాట ప్లే చేశారు. దానికి నేను కారణం కాదు. అయినా మీడియా.. ఈ విషయాన్ని నా మీద వేసింది” అని వివరణ ఇచ్చింది.  

5 /5

ఈ సంఘటన తర్వాత ఇద్దరి మధ్య అసహనం మరింత పెరిగిందని వార్తలు సైతం వచ్చాయి.. . కొంతమంది మాత్రం ఈ వ్యక్తిగత విభేదాల వల్లనే ఉదయభాను కెరీర్ నెమ్మదించిందని అప్పట్లో పెద్ద వినిపించింది. ఒకప్పుడు ఎన్నో షోలకి ఎంపికవుతున్న.. ఆమెకు అప్పటినుంచి అవకాశాలు తగ్గాయని.. టెలివిజన్ రంగంలో కొత్త యాంకర్లు ఎదగడంతో.. ఉదయభాను ప్రాచుర్యం క్రమంగా తగ్గిపోయింది అని అప్పట్లో మీడియా కోడై కూసింది...