Add Zee Business As A Preferred Source
App

Sara Tendulkar: సారా టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిపోయిందా? సచిన్‌ అల్లుడు అతడేనా?

Published: Sep 05, 2025, 08:33 PM IST|Updated: Sep 06, 2025, 12:35 PM IST

Is Sara Tendulkar Got Engaged With Siddharth Kerkar Pics Goes Viral: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వార్త ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల అర్జున్‌ నిశ్చితార్థం జరిగిపోగా.. తాజాగా సారా ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయిందని చర్చ జరుగుతోంది. తాజాగా ఓ యువకుడితో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

Sara Tendulkar Engagement: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ వార్తలు వైరల్‌గా మారాయి. తండ్రి ఫౌండేషన్‌ బాధ్యతలతోపాటు ఇటీవల సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన సారా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లికి కూడా సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. తాజాగా ఓ యువకుడితో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. అతడితో నిశ్చితార్థం జరిగిపోయిందని పుకార్లు వస్తున్నాయి. 

2/6

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమ, డేటింగ్, బ్రేకప్ జరిగిందని సారాపై పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ అసత్యమని తేలిపోయాయి. ఇప్పుడు సారా నిశ్చితార్థం చేసేసుకుందని కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి ఓ యువకుడితో కలిసి సారా దిగిన ఫొటోలు ప్రూఫ్స్‌గా మారాయి. 

3/6

మోడలింగ్‌తోపాటు తండ్రి ఫౌండేషన్‌ బాధ్యతలు, తన వ్యాపారం.. ఇక ఆస్ట్రేలియన్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సారా టెండూల్కర్‌ వ్యహరిస్తోంది. ఈ మధ్యలో కొంచెం విరామం లభించినా వెంటనే విదేశాలకు సారా ఎగిరిపోతుంది. అయితే సారా ఓ యువకుడితో దిగిన ఫొటోలు చూస్తుంటే సారాకు ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి.

4/6

సారా పక్కన కనిపించిన యువకుడి పేరు సిద్ధార్థ్ కేర్కర్. అతడు గోవాలో నివసిస్తుంటాడు. ఓ ఆర్టిస్ట్‌.. గోవాలో హోటల్‌ కూడా ఉందని తెలుస్తోంది. సిద్ధార్థ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పరిశీలిస్తే అతడు గోవాలోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందినట్లు అర్థమవుతోంది. గోవాను సందర్శించిన సమయంలో సిద్ధార్థ్‌తో సారా టెండూల్కర్‌కు పరిచయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

5/6

వారి మధ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి వరకు చేరిందని తెలుస్తోంది. ఎందుకంటే గోవాలో సిద్ధార్థ్‌తో కలిసి సారా తల్లిదండ్రులు సచిన్, అంజలి కూడా కనిపించారు. వారు ముగ్గురు దిగిన ఫొటో చూస్తుంటే సారా పెళ్లి సిద్ధూతోనే అని అర్థమవుతోంది. సిద్ధార్థ్‌తో కలిసి సారా చాలాసార్లు టూర్లు వేసిందని.. గోవాలో చాన్నాళ్లు ఉన్నట్లు ఫొటోలు చూస్తే తెలిసిపోతుంది. 

6/6

సిద్ధార్థ్‌తోనే కాదు అతడి కుటుంబంతో కూడా సారా టెండూల్కర్‌ చక్కటి అనుబంధం కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. సిద్ధార్థ్‌ ఇన్‌స్టాలో చూస్తే వారి ఇంట్లో జరిగిన శుభకార్యం, కొన్ని వేడుకల్లో సారా పాల్గొన్న ఫొటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి నిశ్చితార్థం జరగలేదని అర్థమవుతోంది. ఇవన్నీ పుకార్లు అని తెలుస్తోంది. కాకపోతే ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు ఇక సచిన్‌కు కాబోయే అల్లుడు సిద్ధార్థ్‌ కేర్కార్‌ అని నిర్ధారించుకుంటున్నారు.