Add Zee Business As A Preferred Source
App

Smartphone usage: స్మార్ట్‌ఫోన్‌కి బానిసైపోతున్నారా..? త్వరగా వృద్ధాప్యం వస్తుంది జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే ఇక అంతే సంగతి..!

Written ByAruna Maharaju
Published: Sep 05, 2025, 11:37 AM IST|Updated: Sep 05, 2025, 12:15 PM IST

Smartphone Addiction: స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్ లేకుండా ఉండటం లేదు. కమ్యూనికేషన్ సులభం అయినప్పటికీ, ఈ ఫోన్‌లపై మనం చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. చాలా మంది రోజులో ఎక్కువ సమయం ఫోన్‌లతోనే గడుపుతున్నారు. ఇవి మన మెదడు, కళ్లు, పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లు అతిగా వాడటం వల్ల వయస్సు కూడా వేగంగా పెరిగి.. తొందరగా వృద్ధాప్యం కూడా వస్తుంది.  

Is Your Smartphone Making You Age Faster1/5

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా

స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెడ, భుజాలు, చేతులు, మోచేళ్లలో నొప్పి వస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్, భారత్‌లోని పరిశోధకులు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న 326 మంది విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 43 శాతం మందికి మెడ నొప్పి, 42 శాతం మందికి భుజం నొప్పి, 27 శాతం మందికి మోచేతి నొప్పి ఉన్నట్లు తేలింది. దాదాపు 69 శాతం మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లకు మితిమీరిన వ్యసనంతో ఉన్నారని కనుగొన్నారు.  

Smartphone Addiction2/5

స్మార్ట్‌ఫోన్‌

ఈ నొప్పులకు ముఖ్య కారణం తప్పుడు పొజిషన్. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు తలను ముందుకు వంచడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇది మెడ నొప్పికి దారితీస్తుంది. అలాగే ఫోన్‌ను ఎక్కువసేపు పట్టుకోవడం, టెక్స్ట్ చేయడం, స్క్రోల్ చేయడం వల్ల చేతులు, మణికట్టు, భుజాలపై ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే, ఈ నొప్పులు దీర్ఘకాలిక సమస్యలుగా మారి, జీవన నాణ్యతను దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  

Smartphone Usage3/5

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా

ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఫోన్‌ను కంటి స్థాయిలో పట్టుకోవడం వల్ల మెడ, వీపుపై ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువసేపు కాల్స్ మాట్లాడేటప్పుడు హెడ్‌ఫోన్స్ ఉపయోగించడం మంచిది.   

Smartphone 4/5

స్మార్ట్‌ఫోన్‌

టెక్స్ట్ చేసేటప్పుడు రెండు చేతులనూ ఉపయోగించి, ఫోన్‌ను గట్టిగా పట్టుకోకుండా ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడటం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.    

Smartphone Usage5/5

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా

స్మార్ట్‌ఫోన్‌లను మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఫోన్‌ను బాధ్యతాయుతంగా వాడితే, ఈ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. లేకపోతే ఈ నొప్పులు దీర్ఘకాలికంగా మారి, శరీరాన్ని, జీవన విధానాన్ని దెబ్బతీస్తాయి. సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే, దాని ప్రయోజనాలను పొందవచ్చు, హానిని తగ్గించవచ్చు.