Add Zee Business As A Preferred Source
App

Heart Health: మీ గుండె సరిగ్గా పనిచేస్తోందా? ఒకసారి మీ నాలుక చెక్‌ చేసుకోండి..

Written ByRenuka Godugu
Published: Sep 16, 2025, 03:10 PM IST|Updated: Sep 16, 2025, 03:10 PM IST

Tongue Says Heart Health: మీ నాలుక చూస్తే మీ గుండె ఎలా పనిచేస్తుందో కూడా చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మీ కళ్ళు మీ ఆత్మకు ఒక నిదర్శనం అవుతే.. మీ నాలుక మీ గుండె ఆరోగ్యానికి ఒక అర్థమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. ఈ నేపథ్యంలో మీ నాలుక రంగును బట్టి మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చట
 

Sugery1/5

సర్జరీ

 ఈ కాలంలో గుండె సమస్యలతో చాలామంది చనిపోతున్నారు. ప్రధానంగా ఎన్నో సర్జరీలు కూడా చేయించుకునే పరిస్థితి. దీనికి కొన్ని లక్షల ఖర్చు కూడా తప్పదు. అయితే గుండె సమస్యలు ఈ కాలంలో సాధారణమే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె సమస్యలతో చనిపోతున్నారు, దాని బారిన పడుతున్నారు.  

Heart Health2/5

గుండె ఆరోగ్యం

 అయితే కొన్ని లక్షణాలను బట్టి మన గుండె ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని చెకప్ లో ఉంటే మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా కూడా గుండె ఆరోగ్యం తెలుసుకోవచ్చు. మీ నాలుక రంగును బట్టి గుండె ఆరోగ్యం ఎలా ఉందో అది ఎలా పనిచేస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. కొన్ని నివేదికల ప్రకారం గుండెకు నాలుకకు లింక్ అయి ఉంటుంది   

Tongue3/5

నాలుక

 సాధారణ జనం కంటే గుండె ఫెయిల్యూర్ అయిన రోగి నాలుక భిన్నంగా ఉంటుందంట. వారి నాలుక రంగు కోల్పోయి పేలవంగా మారిపోతుందంట అయితే ఇది గుండె ఫెయిల్యూర్ కి నిదర్శనం. కొంత మంది హార్ట్ ఫెయిల్యూర్ పేషంట్లకి బాగా ఎరుపు రంగులో ఎల్లో పసుపు రంగు కలిసి కనిపిస్తుంది . ఇది నాలుకపై విభిన్నంగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

Heart Failure4/5

గుండె ఫెయిల్యూర్

నాలుకపై ఉండే రంగును సాధారణ జనానికి గుండె ఫెయిల్యూర్ అయిన రోగి తేడాను తెలుసుకోవచ్చట. అయితే ఈ నివేదిక ప్రకారం 42 మంది గుండె రోగులకు ఎలాంటి అనారోగ్య అలవాట్లు కూడా లేవట. వారికి ఈ నేపథ్యంలో నాలుక, పంటికి సంబంధించిన వ్యాధులు గతంలో కూడా లేవు.  

Disclaimer5/5

డిస్క్లైమర్

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)