Ishan Kishan Flying to Kiss Kavya Maran: గత సీజన్‌లో భారీ స్కోర్లతో చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌తోనే ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి.. మరోసారి 300 రన్స్‌కు చేరువగా వచ్చింది. అనంతరం ఛేజింగ్‌లో రాజస్థాన్ 242 పరుగులకు పరిమితం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. సెంచరీ అనంతరం ఇషాన్ కిషన్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా.. టీమ్ ఓనర్ కావ్యమారన్ చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
What a Beauty my Boii Ishan Kishan ?
— Uvaish (@MohdUvaish1279) March 23, 2025
First Match In #SunrisersHyderabad and First Century ?️
Absolute Cinema ?
Most Happiest person Kavya Maran ♥️#SRHvRR pic.twitter.com/OUwQpIdMJj
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. గత సీజన్‌లో ఎక్కడైతే ఆపారో.. మళ్లీ అక్కడి నుంచే మొదలు పెడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఇషాన్ కిషన్ (106) సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. హెడ్ (67), నితీశ్ కుమార్ రెడ్డి (30), క్లాసెన్ (34), అభిషేక్ శర్మ (24) క్రీజ్‌లో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించారు. లక్ష్య ఛేదనలో పోరాడిన రాజస్థాన్.. 242 రన్స్ చేసింది.
ఇక సన్‌రైజర్స్ మ్యాచ్ అంటే ముందుగా అందరికీ గుర్తుచ్చొది కావ్య మారన్. ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతూ.. ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తుంటారు. ఆదివారం సన్‌రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు కావ్య మారన్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు.
బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్న సమయంలో నవ్వుతూ కనిపించారు. కెమెరామెన్ కూడా పదే పదే కావ్య పాపను ఫోకస్ చేయడంతో అభిమానులు స్టేడియంలో కేరింతలు పెట్టారు.
సెంచరీ అనంతరం ఇషాన్ కిషన్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం.. కావ్య మారన్ చప్పట్లతో అభినందించడం చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ సమయంలోనే కావ్య మారన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ట్విట్టర్‌లో కావ్య పేరును ట్రెండ్ చేస్తూ.. ఆమె పిక్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.