ITI: ఆసక్తి, తపన ఉంటే చాలు.. ఐటీఐతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు.. విదేశాల్లోనూ దుమ్ములేపచ్చు..!!

ITI: ఆసక్తి, తపన ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఐటీఐ శిక్షణతోనూ అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలెన్నో ఉన్నాయి. విదేశాల్లోనూ రాణించవచ్చు. ఎంతోమందికి ఉపాధిని కల్పించే స్థాయికి మీరు చేరుకోవచ్చు. 

1 /9

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్సడ్ ట్రైనింగ్ సెంటర్లుగా విస్తరిస్తున్నాయి. వీటిలో ట్రైనింగ్ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 800కు పైగా విద్యాసంస్థలు సుమారు 50 ట్రేడుల్లో శిక్షణను అందిస్తున్నాయి.   

2 /9

ఎందుకంటే ఈ కోర్సులు పూర్తి చేసినవారికి ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదు. భారత్ లో మేకిన్ ఇండియాకి ప్రోత్సాహం, డెవలప్ మెంట్ కౌన్సిల్ ఏర్పాటుతో ఐటీఐట్రేడుల్లో పట్టుకున్నవారికి మంచి గిరాకీ పెరిగింది. ఐటీఐల్లో 10వ తరగతి అర్హతతో ఏడాది, రెండేళ్ల వ్యవధితో పలు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో కోర్సులను అందిస్తున్నారు. 

3 /9

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 50 స్పెషలైజెషన్లు లభిస్తున్నాయి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నీసియన్ వంటి కోర్సుల్లోనూ కొన్ని చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏపీలో 519, తెలంగాణలో 320 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు నడుస్తున్నాయి. వీటిలో బాలికలు, బాలురులు మైనార్టీల కోసము కూడా ఉన్నాయి.

4 /9

ఐటీఐ తర్వాత అవకాశాలు స్టీల్ ప్లాంట్స్, నేవల్ డాగ్ యార్డ్స్, నౌకాయానసంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో  నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివినవారికి ఉద్యోగాలు ఉన్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పలు ఉద్యోగాలకు వీరు అర్హులు. సాంకేతిక పోస్టుల్లోనూ అగ్రభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్నవారితో భర్తీ చేస్తున్నారు.   

5 /9

రైల్వేలోనూ వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ కంప్లీట్ చేసినవారు అర్హులు.   

6 /9

రాస్ట్ర స్థాయిలో ఎలక్ట్రికల్ లేదా వైర్ మెన్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసినవారు జూనియర్ లైన్ మెన్ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్ మన్, రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్నవారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ప్రిపేర్ కావచ్చు. 

7 /9

ఆర్మీలో సోల్జర్ ట్రేడ్స్ మెన్ విభాగంలోని కొన్ని పోస్టులకు ఐటీఐ తప్పనిసరి అని మీకు తెలుసా. ఈ ప్రకటనలే ఏటా వెలువడుతూనే ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ , సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటల్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ విభాగాల్లో ఐటీఐ చదివినవారికి అవకాశాలుఉన్నాయి. 

8 /9

స్కిల్స్ ఉన్న ప్లంబర్ , కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఏసీ, రెఫ్రిజిరేటర్ మెకానిక్స్ కు పట్టణాలతోపాటు నగరాలతోపాటు పల్లెల్లోనూ మంచి డిమాండ్ ఉంది.   

9 /9

తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధప్రదేశ్ లిమిటెడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు విదేశీ ఉద్యోగాలకు దారి చూపిస్తున్నాయి. అంతేకాదు ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు, సింగపూర్ తోపాటుమలేషియాలతోపాటుపలు దేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.