Add Zee Business As A Preferred Source
App

Casting Couch: పిలిచినప్పుడల్లా వెళ్లాలి లేకపోతే కొట్టేవారు.. ఇండస్ట్రీ పెద్ద గురించి స్టార్ నటి షాకింగ్ వ్యాఖ్యలు..

Written ByVishnupriya
Published: Sep 23, 2025, 05:31 PM IST|Updated: Sep 23, 2025, 05:31 PM IST

Casting Couch In Tollywood: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను పదేళ్లకు పైగా అలరిస్తున్న షో జబర్దస్త్.. అనేక మంది ఆర్టిస్టుల జీవితాలను మార్చేసింది. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది సాధారణ ఆర్టిస్టులు.. స్టార్‌లుగా ఎదిగారు. అదే వేదికపై తన ప్రతిభను నిరూపించుకున్న ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్.. తన్మయి కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది.
 

Casting Couch Telugu Industry1/5

జబర్దస్త్ తన్మయి

1995లో హైదరాబాద్‌లో జన్మించిన తన్మయి, చిన్నప్పటి నుంచే కళారంగంపై…ఆసక్తి చూపించింది. ట్రాన్స్‌గా మారిన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. ఆ ప్రయత్నంలోనే జబర్దస్త్ వంటి షోలు, "అదిరింది" వంటి ప్రోగ్రాముల్లో తనదైన శైలిలో మెప్పించింది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లోనూ నటించింది.

Jabardast Actress About Casting Couch2/5

జబర్దస్త్ తన్మయి

తన్మయి ప్రతిభకు అవకాశం వచ్చినప్పటికీ.. సినీ పరిశ్రమలో ఎదురైన ఇబ్బందులు మాత్రం ఆమెను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్న ఆమె.. కొంతమంది పెద్ద స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు తనను వేధించారని, వ్యక్తిగత సమస్యల్లో ఉన్నప్పుడు.. దుర్వినియోగం చేశారని వాపోయింది. కుటుంబ పరిస్థితులు క్లిష్టంగా ఉండడం, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో తాను బలహీన స్థితిలో ఉండగా.. పరిశ్రమలోని కొంతమంది తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పింది.  

Tanmayi About Casting Couch 3/5

జబర్దస్త్ తన్మయి

తన్మయి మాట్లాడుతూ..” మా అమ్మ నాన్నకి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు.. నన్ను ఇండస్ట్రీలోని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి.. తను పిలిచినప్పుడల్లా వెళ్లాలని బెదిరించే వాడు. వినకపోతే కొట్టేవాడు. నానా రకాలుగా తిట్టడం.. వేధించడం లాంటివి చేశారు. నాకు డబ్బులు అవసరం పడి వాళ్లతో ఉండాల్సి వచ్చింది. నన్ను కొట్టడం, చేయిచేసుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించే వారు.”అని చెప్పుకొచ్చింది.

Senior Celebrity Casting Couch 4/5

జబర్దస్త్ తన్మయి

ఇక తన్మయి జీవితంలో మరో కఠిన ఘట్టం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అవకాశాన్ని చేజారుకోవడం. చివరి నిమిషంలోనే హౌస్ ఎంట్రీ అవకాశాన్ని కోల్పోయిందని ఆమె తెలిపింది. అయినప్పటికీ, వెనుకడుగు వేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది.

Casting Couch Comments 5/5

జబర్దస్త్ తన్మయి

తన్మయి మాట్లాడుతూ, "ఇక నా లక్ష్యం ఒక్కటే– నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రేమ, సంబంధాల గురించి ప్రస్తుతం నేను ఆలోచించను. నా అన్నయ్య చిన్నప్పటి నుంచే నన్ను ఆదరిస్తూ వస్తున్నాడు. నేను ట్రాన్స్‌గా మారినా, చివరికి అంగీకరించాడు. ఇప్పుడు నా పేరుతో మా కుటుంబానికి గౌరవం వచ్చింది." అని చెప్పుకొచ్చింది.