Add Zee Business As A Preferred Source
App

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 8వ వేతన సంఘంతో నిండనున్న జేబులో పర్స్‌

Published: Sep 09, 2025, 04:20 PM IST|Updated: Sep 09, 2025, 09:20 PM IST

Jackpot For Govt Employees With 8th Pay Commission Pension Hike: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలన్నీ 8వ వేతన సంఘంపైనే ఉన్నాయి. వేతన సంఘం అమలైతే భారీగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని ఆశిస్తున్నారు. జీతాలతోపాటు పింఛన్లు పెరుగుతాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా పింఛన్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 8వ వేతన సంఘం కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. వేతనాల పెంపుతోపాటు పింఛన్‌ పెంపు కూడా భారీగా ఉంటుందని చర్చ జరుగుతోంది. లక్షలాది మంది పెన్షనర్లకు వేతన సంఘం శుభవార్త అందించనుందని తెలుస్తోంది.

2/6

8th Pay Commission: కొత్త వేతన సంఘంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రమే కాకుండా పెన్షనర్ల పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నట్లు చర్చ జరుగుతోంది. 1 జనవరి 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ వేతన సంఘంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొత్త వేతన సంఘంలో ఉద్యోగులకు భారీగా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. 

3/6

8th Pay Commission: 7వ వేతన సంఘం 31 డిసెంబర్ 2025న ముగియనుంది. 1 జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 48 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షలకు పైగా పింఛన్‌దారులు ఉండగా.. వారికి వేతన సంఘం ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం లభిస్తుంది.

4/6

8th Pay Commission: కొత్త వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకం 2.28 శాతం నుంచి 3 శాతం పరిధిలో ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కరువు భత్యం (డీఏ)లో కూడా భారీ పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఫిట్‌మెంట్ కారకాన్ని ఊహించినట్టు పెంచితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.21,600కు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం దాదాపు 34.1 శాతం పెరగవచ్చు.

5/6

8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకారం పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పింఛన్‌లలో కూడా భారీగా పెరుగుదల ఉండనుంది. పెన్షనర్ల కనీస పెన్షన్ కూడా రూ.9,000 నుంచి రూ.20,500కు పెరుగుతుందని చర్చ జరుగుతోంది. పెన్షన్‌లో మార్పు ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది.

6/6

8th Pay Commission: అక్టోబర్ లేదా నవంబర్ 2025లో 8వ వేతన సంఘం కమిటీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రకటించిన కమిటీ మంత్రిత్వ శాఖలు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించనుంది. సంప్రదింపులు.. చర్చల అనంతరం ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్థిక నిపుణుల సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందించనుంది. అన్ని సవ్యంగా సాగితే వేతన సంఘం వచ్చే ఏడాదిలో అమలుకానుంది.