Add Zee Business As A Preferred Source
App

Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అలా రిటైరయ్యారో ఇలా అకౌంట్‌లోకి 

Published: Oct 01, 2025, 08:36 AM IST|Updated: Oct 01, 2025, 08:36 AM IST

Govt Likely To Pay Retirement Benefits Before 3 Months Of Retirement: తమ జీవితంలో సగం ప్రభుత్వ సేవలకు వెచ్చించిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందినా కూడా కష్టాలు తప్పడం లేదు. ఇకపై ఆ కష్టాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా రిటైరయ్యారో లేదో అలా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

1/6

యుక్త వయసు నుంచి దాదాపు సగం జీవితం ప్రభుత్వ సేవలకు అంకితం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు. వీరంటే సమాజంలో ఒక చిన్నచూపు ఆ ప్రభుత్వ ఉద్యోగులు తిని కూర్చున్నా జీతం వస్తుందని చెబుతుంటారు. కానీ పరిస్థితులు ఉండవు. వారికి రావాల్సిన డీఏలు, వేతనాల పెంపు, నెల వారీ జీతంతోపాటు చివరికి రిటైరయ్యాక వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందవు. వాటికి కాళ్లరిగేలా తిరగాలి.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాలి.

2/6

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం జరగదని.. సకాలంలో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

3/6

కేంద్ర ఉద్యోగులకు పదవీ విరమణకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రం మార్గనిర్దేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధనకు నియమ నిబంధనలు విడుదల చేసింది. 

4/6

పెన్షన్‌ చెల్లింపు ఆదేశాల జారీలో నిరీక్షణ తొలగించేందుకు పదవీ విరమణకు ముందే విజిలెన్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం వంటి అనేక విధానపరమైన సంస్కరణలను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

5/6

కేంద్ర సివిల్‌ సర్వీసుల (పెన్షన్‌) నిబంధనలు - 2021 కింద విజిలెన్స్‌ క్లియరెన్స్‌ లేని కారణంగా పెన్షన్‌ చెల్లింపుల్లో ఆలస్యమవుతోందని తెలిపింది. ఇకపై పింఛన్‌ చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా చేస్తామని తెలిపింది.

6/6

పదవీ విరమణకు మూడు నెలల ముందే తన సిబ్బందికి సంబంధించి విజిలెన్స్‌ క్లియరెన్స్‌ను ప్రతి శాఖ అందించాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లియరెన్స్‌ ఇచ్చాక ఉద్యోగి పదవీ విరమణ పొందే సమయానికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి చూడాలి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో రిటైర్మెంట్‌ ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయో?