Add Zee Business As A Preferred Source
App

Star Hero: పొలిటీషియన్స్ అందరూ విలన్సే.. తెలుగు స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు.. పవన్ అభిమానుల ఆగ్రహం..!

Written ByVishnupriya
Published: Sep 23, 2025, 08:05 AM IST|Updated: Sep 23, 2025, 08:05 AM IST

Pawan Kalyan Politics : తెలుగు స్టార్ హీరో తాజాగా పొలిటిషియన్స్ పై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పాలిటిక్స్ లో మొత్తం విలన్లు మాత్రమే ఉన్నారు అంటూ ఈ హీరో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు అనే విషయానికి వెళితే..

Star Hero Comments 1/5

జగపతిబాబు

తాజాగా తెలుగు స్టార్ హీరో పొలిటీషియన్స్ పై చేసిన వ్యాఖ్యలు అందరినీ షాకి కి గురి చేస్తున్నాయి. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే ఆ హీరో ఇప్పుడు.. పొలిటీషియన్స్ పై పడ్డారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు.   

Star Hero Comments on Politics2/5

జగపతిబాబు

అసలు విషయానికి వస్తే ‌.. హీరో జగపతిబాబు.. ఈ మధ్య మిరాయి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో కపిల్ శర్మ షో కి అటెండ్ అయ్యారు. 

Jagapathi Babu Interview3/5

జగపతిబాబు

ఆషోలో కపిల్.. జగపతిబాబుని మీరు పాలిపిక్స్ లోకి వచ్చే.‌. అవకాశం ఉందా అంటూ జగపతిబాబుని అడిగారు. దానికి జగపతిబాబు షాకింగ్ సమాధానం ఇచ్చారు…  

Jagapathi Babu About Politics4/5

జగపతిబాబు

జగపతిబాబు మాట్లాడుతూ.. “నాకు పాలిటిక్స్ లోకి రావాలనే ఉంది. అయితే నేను సినిమాల్లో విలన్ పాత్ర చేస్తాను కదా.. అక్కడికి వస్తే నేను హీరో అయిపోతా.. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు మొత్తం విలన్స్..” అంటూ చెప్పుకొచ్చారు.   

Pawan Kalyan Fans About Jagapathi Babu5/5

జగపతిబాబు

ఇక పాలిటిక్స్ లో ఉన్నవాళ్లు అందరిని కూడా విలన్స్ అని జగపతిబాబు అనేయడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుతం హీరో పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ అభిమానులు.‌. జగపతిబాబు ఇలా అనటం కరెక్ట్ కాదు అని ..పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా ఉంటారు అని కామెంట్స్ పెడుతున్నారు.