Janhvi Kapoor: క్యూట్ లుక్స్ తో జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్.. దేవర భామకు తెలుగులో వరుస ఛాన్సులు..

Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రెజెంట్ ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో   జాన్వీ గతేడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాదు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమాలో కీ రూల్ ప్లే చేస్తోంది.  

 

1 /6

జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ లకు ముంబైలో  పుట్టింది. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ట్రై చేస్తోంది. అందుకే దక్షిణాదిలో ఫస్ట్  ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ చిత్రంతో  తెలుగులో ఎంట్రీ ఇచ్చి గుడ్ స్టార్ట్ చేసింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ తెలుగులో స్టార్ హీరోయిన్ సౌత్ లో కాకుండా.. ప్యాన్ ఇండియా లెవల్లో జెండా పాతడం పక్కా అని చెబుతున్నారు.

2 /6

జాన్వీ కపూర్.. తారక రామారావు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో   తెరకెక్కిన ‘దేవర’ మూవీతో  తెలుగు సినీ పరిశ్రమలో లెగ్ పెట్టింది. ఇక ఫస్ట్  మూవీతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైందనే చెప్పాలి. దేవర రెండో భాగంలో జాన్వీ పాత్రకు మంచి ప్రాముఖ్యత  ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ‘దేవర’మూవీ సక్సెస్ అయినా.. జాన్వీకి పెద్దగా  ఒరిగిందేమి లేదు.

3 /6

జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు 8 యేళ్లు కంప్లీట్ కానీకొచ్చింది.  అయినా ఇప్పటికీ  కథానాయికగా సరైన  బ్రేక్ మాత్రం రాలేదు. అంతేకాదు వరుసగా తన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతానికి  దక్షిణాది  సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. త్వరలో అల్లు అర్జున్, నాని సినిమాల్లో హీరోయిన్ గా జాన్వీ పేరును పరిశీలిస్తోంది.  

4 /6

  జాన్వీ కపూర్.. హిందీ చిత్రం 'ధడక్‌'తో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  చిత్రాలు ఎక్కువగా  థియేటర్ లో కాకుండా.. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ వచ్చాయి. 

5 /6

  జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయి. జాన్వీకి  ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 26 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

6 /6

  ఇన్నేళ్లలో జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే ఈమెను ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. బాలీవుడ్ లో  సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలనే ఆలోచనలో ఉంది.  చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది.