Janhvi Kapoor Comments : తాజాగా ఒక టాక్ షోలో జాన్వీ కపూర్ తో పాల్గొన్న ఒక సెలబ్రిటీ 26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయానని చెప్పి ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా జాన్వి కపూర్ ఫ్యామిలీలో ఒకరితో చాలా క్లోజ్ గా ఉన్నాను అని చెప్పి మరింత ఆశ్చర్యపరిచారు.. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు.. ఏం జరిగింది అనే పూర్తి వివరాలులోకి వెళితే..
1/5టాలీవుడ్, బాలీవుడ్ లో అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో , అభినయంతో పలు చిత్రాలలో నటించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నిరంతరం గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంది జాన్వీ కపూర్.
2/5అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ అనే షోకి.. కరణ్ జోహార్ తో పాటుగా జాన్వీ కపూర్ కూడా గెస్ట్ గా వచ్చారు.
3/5ఇందులో కరణ్ జోహార్ మాట్లాడుతూ..” 26 సంవత్సరాలకే నేను వర్జినిటీ కోల్పోయానని. జాన్వి కపూర్ ఫ్యామిలీ లో ఒకరితో నేను చాలా ఇంటిమేట్ గా ఉన్నాను" అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు కరణ్ జోహార్.
4/5ఈ విషయం విన్న.. జాన్వీ కపూర్.. కరణ్ మాటలకు షాక్ అయినా.. అతడు అబద్ధం చెప్పాడని.. అబద్దాన్ని కూడా చాలా జోవియల్ గా నిజం అనిపించేలా చెబుతాడు అంటూ కామెంట్లు చేసింది.
5/5మొత్తానికి అయితే అటు షాకింగ్ కామెంట్ చేసిన కరణ్ జోహార్.. ఇటు జాన్వీ కపూర్ రియాక్షన్ రెండు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. కరణ్ జోహార్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా గెస్ట్ పాత్రలు కూడా పోషిస్తూ అలరిస్తున్నారు.