Janhvi Kapoor: బర్త్ డే వేళ జాన్వీపాపకు బిగ్ ట్విస్ట్.. అలాంటి గిఫ్ట్ పంపిన స్టార్ హీరో.. మ్యాటర్ ఏంటంటే..?

Janhvi Kapoor birthday: జాన్వీకపూర్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. ఈరోజు దేవర బ్యూటీ 28 వడిలో అడుగుపెట్టంది. ఈ నేపథ్యంలొ జాన్వీ కపూర్ కు ఆమె ఫ్రెండ్స్,  అభిమానులు  సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషేస్ చెప్తున్నారు. 
 

1 /6

అతిలోక సుందరీ శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అచ్చం తల్లిలా అందం, అభినయంతో అభిమానుల్ని సొంతం చేసుకుంది. దఢఖ్ మూవీతో ఈ భామ వెండితెర మీద ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఈ భామ.. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తనదైన స్టైల్ లో మార్కులు కొట్టేసింది. 

2 /6

జాన్వీపాప.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హట్ హట్ గా, ట్రెండీగా  అందాలను ఆరబోస్తు.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఈ రోజు జాన్వీ పాప పుట్టిన రోజు.. ఆమె నేడు 28వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్ర‌మంలో అభిమానులు, సెల‌బ్రిటీలు జాన్వీక‌పూర్‌కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీపాపకు.. ఆమె కోస్టార్ రోహిత్ సరాఫ్ ఊహించని గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేశాడు.  

3 /6

జాన్వీకపూర్ కు మొదటి నుంచి శునకాలంటే ఎంతో ఇష్టం. ఆమె తన ఇంట్లో కూడా జర్మన్ షెఫార్డ్ బ్రీడ్ ను పెంచుకుటుంది. ఈ క్రమంలో రోహిత్ సరాఫ్ అచ్చం శునకంలాంటి ఒకకేక్ ను రెడీ చేయించి జాన్వీపాపకు పార్శీల్ చేశాడు. ఆ పార్శీల్ ఓపెన్ చేసిన జాన్వీపాప సర్ ప్రైజ్ కు గురైంది.   

4 /6

ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసి లవ్ యూ.. రోహిత్ అంటూ కూడా తన హ్యాపీనెస్ ను పంచుకున్నారు. తనకు ఇష్టమైన గిఫ్ట్ పంపినందుకు చాలా థైంక్స్ అంటూ కూడా కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా.. జాన్వీపాప నటుడు వరుణ్ ధావన్, రోహిత్ సరాఫ్ లతో కలసి మూవీ తీస్తున్నారు.  

5 /6

సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ అనే మూవీ చేస్తుంది. ఈ సినిమాను  శశాంక్ కైతాన్ డైరెక్ట్  చేస్తున్నారు. ఈ మూవీ, స్వచ్చమైన లవ్ స్టోరీ నేపథ్యంలో అభిమానుల ముందుకు రానుంది.  ధడక్ సినిమా తర్వాత జాన్వీ ఈ చేస్తున్నరొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ఇదే.   అదే విధంగా.. జాన్వీపాప పుట్టిన రోజు నేపథ్యంలో..  ఆర్‌సీ 16 చిత్ర బృందం కూడా జాన్వీకి వెరైటీగా విషెస్ తెలియ‌జేసింది.   

6 /6

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ RC16.  ఈ సినిమాలోని ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీనిలో జాన్వీక‌పూర్ కుడి చేత్తో మేక‌పిల్ల‌ను ఎత్తుకోగా, ఎడ‌మ చేత్తో గ‌డ్డి మొక్క‌ను ప‌ట్టుకుని స్మైల్ ఇచ్చింది.. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.