Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా వెండితెర అరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు నటిగా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తోన్న RC 16 సినిమాలో ఈమె లుక్ ను విడుదల చేశారు. ఒక గొర్రె పిల్లను పట్టుకున్న జాన్వీ లుక్ నకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ లకు ముంబైలో జన్మించింది.
జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గుడ్ స్టార్ట్ చేసింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ తెలుగులో జెండా పాతేయాలని ఫిక్స్ అయింది.
జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో లెగ్ పెట్టింది. ఇక ఫస్ట్ చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. రెండో భాగంలో జాన్వీ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందా అనేది వెయిట్ అండ్ సీ. మొత్తంగా సినిమా సక్సెస్ అయినా.. జాన్వీకి పెద్దగా ఒరిగిందేమి లేదు.
జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 8 ఇయర్స్ అవుతోంది. అయినా ఇప్పటికీ హీరోయిన్ గా బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. త్వరలో అల్లు అర్జున్, నాని సినిమాల్లో కథానాయికగా ఈమె పేరు దాదాపు ఖరారైంది.
జాన్వీ కపూర్.. హిందీ చిత్రం 'ధడక్' తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన చిత్రాలు ఎక్కువగా థియేటర్ లో కాకుండా.. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ వచ్చాయి.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయనే చెప్పాలి. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇన్నేళ్లలో జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే ఈమెను ప్రేక్షకులు గుర్తుస్తున్నారు. బాలీవుడ్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.