Add Zee Business As A Preferred Source
App

Janhvi Kapoor: మా అమ్మ మరణించాక..కొందరు మాపై బురద చల్లాలని చూశారు.. శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ ఎమోషనల్..!!

Written ByBhoomi
Published: Sep 02, 2025, 11:29 PM IST|Updated: Sep 02, 2025, 11:29 PM IST

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death: బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి మరణించి ఐదేళ్లకుపైగా గడిచిపోయింది. కానీ ఆమె జ్ఞాపకం ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. తల్లి మరణం తర్వాత జాన్వీ కపూర్ తన జీవితంలో ఎదుర్కొన్న బాధను పలు సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా జాన్వీ కపూర్  చేసిన ఎమోషనల్ కామెంట్స్ మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death1/8

మా అమ్మను కోల్పోవడం

జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మా అమ్మను కోల్పోవడం మా కుటుంబానికి ఊహించలేని నష్టమే. కానీ దానికంటే బాధ కలిగించిన విషయం ఏమిటంటే, కొందరు ఆ సందర్భాన్ని కూడా మాపై బురద చల్లడానికి వాడుకున్నారు. మేము మా తల్లిని కోల్పోయి బాధలో ఉన్న సమయంలో, కొందరు నిరాధార ఆరోపణలు చేస్తూ మాకే నిందలు మోపడానికి ప్రయత్నించారు. ఒక తల్లి మరణాన్ని సెన్సెన్షనల్ న్యూస్ లా చూపడం ఎంత బాధాకరమో మేమే అనుభవించాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death2/8

మా అమ్మ ఎప్పుడూ మాకు బలమే

మా అమ్మ ఎప్పుడూ మాకు బలమే. నా ప్రతి అడుగులోనూ ఆమె వెన్నంటి ఉండేది. నేను నేడు నటిగా నిలబడటానికి కారణం ఆమె ఇచ్చిన ప్రోత్సాహమే. తల్లిని కోల్పోయిన తర్వాత చాలా ఖాళీగా అనిపించింది. కానీ అమ్మ ఇచ్చిన విలువలు, ఆమె నేర్పిన పాఠాలే నాకు ధైర్యం ఇచ్చాయి. ఆమె కష్టం చేసి సంపాదించిన గౌరవాన్ని నేను ఎప్పటికీ కాపాడుకుంటాను అని అన్నారు.

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death3/8

మానసికంగా చాలా నష్టం

అమ్మ గురించి తప్పుడు కథలు సృష్టించి ప్రచారం చేసినవాళ్లు మాకు మానసికంగా చాలా నష్టం చేశారు. కానీ మేము మా తల్లి ఇచ్చిన బలంతోనే దాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా, ప్రతి నిర్ణయం  అన్నీ అమ్మ గర్వపడేలా ఉండాలని మాత్రమే అనుకుంటున్నాను అంటూ జాన్వీకపూర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death4/8

అమ్మ మరణం చాలా మందికి ఓ ఎంటర్ టైన్ మెంట్

మీడియా ఎప్పుడూ నాపై ఫోకస్ పెట్టింది. నా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు నవ్వితే..విమర్శలు చేసేవారు. ఏం మాట్లాడకుండా ఉంటే..చాలా సైలెంట్ అంటూ కామెంట్స్ చేసేవారు. అమ్మ మరణం చాలా మందికి ఓ ఎంటర్ టైన్ మెంట్ గా మారింది అంటూ జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death5/8

శ్రీదేవి 2018లో అకాల  మరణం

శ్రీదేవి 2018లో అకాల  మరణం  చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినిమాల్లోకి వచ్చేందుకు జాన్వీకపూర్ రెడీ అయ్యింది. ఆ ఏడాది మేలో శ్రీదేవి మరణించిన తర్వాత.. జాన్వీ తొలి చిత్రం ధడక్ జులై నెలలో రిలీజ్ అయ్యింది.  

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death6/8

 తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక

 తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తనకు జీవితంలో ముందుకు వెళ్లడం చాలా క్లిష్టంగా అనిపించిందని..బాధ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద యుద్ధం చేశానని జాన్వీ గతంలో పేర్కొన్నారు. 

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death7/8

పరమ్ సుందరితో ప్రేక్షకుల మందుకు

కాగా పరమ్ సుందరితో ప్రేక్షకుల మందుకు వచ్చిన జాన్వీకపూర్ సన్నీ సంస్కారి కీ తులసీ కుమారితో బిజీబిజీగా ఉన్నారు. ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఇక తెలుగులోనూ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.   

Janhvi Kapoor's Emotional Comments About Sridevi Death8/8

జాన్వీ కపూర్ ఈ ఎమోషనల్ కామెంట్స్

జాన్వీ కపూర్ ఈ ఎమోషనల్ కామెంట్స్ విన్న అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. శ్రీదేవి నిజంగా ఒక లెజెండ్, ఆమె లాంటి తల్లిని కోల్పోవడం ఎంత కష్టమో ఊహించలేం. జాన్వీ ధైర్యం ప్రశంసనీయం అని కామెంట్స్ చేస్తున్నారు.