Add Zee Business As A Preferred Source
App

Haircare: పెచ్చులు పెచ్చులు డాండ్రఫ్.. తెల్ల వెంట్రుకలు.. హెయిర్‌ఫాల్‌కు జావెద్‌ హబీబ్‌ ట్రిక్‌తో చెక్‌..!

Written ByRenuka Godugu
Published: Sep 04, 2025, 04:02 PM IST|Updated: Sep 04, 2025, 04:02 PM IST

Hair Care Routine: హెయిర్ కేర్ ఎక్స్‌పర్ట్‌ జావేద్ హబీబ్ హెయిర్ వాష్ టిప్ ని అందించారు. తద్వారా మీ జుట్టు తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది. మంచి కండిషన్ అంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. మీరు కెమికల్స్‌ వాడకుండానే పైసా ఖర్చు లేకుండానే ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అదేంటో తెలుసుకుందాం..
 

Hair Care Routine1/5

హెయిర్ కేర్ రొటీన్

 కేవలం బాల ద్వారా మీరు సులభంగా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిరోహించవచ్చు. ముందుగా సాధారణ నీటితో మీ జుట్టు అంతా కడగాలి. తద్వారా జుట్టుపై ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇప్పుడు జుట్టు అంతటికి కాస్త నూనె అప్లై చేయండి కానీ కుదుళ్లకు అంటకుండా నెమ్మదిగా జుట్టంతటినీ అప్లై చేసి కాస్త దువ్వండి   

Hair wash2/5

హెయిర్ వాష్

 నూనె పెట్టిన ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండనివ్వండి. లేకపోతే కుదుళ్లు కూడా చాలా జిడ్డుగా మారిపోతాయి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా షాంపూ లేదా సబ్బు ఇతర హెర్బల్ శీకాకయ్ వంటివి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి.  

Natural Products3/5

 నాచురల్ ఉత్పత్తులు

 నాచురల్ ఉత్పత్తులు వాడడానికి ట్రై చేయండి. ఈ టెక్నిక్ తో మీకు త్వరగా తెలవెంట్రుకల సమస్య రాదు. హెయిర్ ఫాల్ కూడా ఉండదు. పెచ్చులు పెచ్చులు గా ఉండే డాండ్రఫ్ కి కూడా చెక్ పెట్టొచ్చు  

Hairfall4/5

హెయిర్ ఫాల్

ఇలా ప్రతిసారి తలస్నానం చేయటం వల్ల మీ జుట్టు బలంగా మారుతుంది. హెయిర్ ఫాల్ సమస్య అసలే ఉండదు. చుండ్రు కూడా దరిదాపుల్లో కూడా రాదని హెయిర్ కేర్ నిపుణుడు జావేద్ హబీబ్ అన్నారు.  

Headbath5/5

తలస్నానం

జుట్టు తలస్నానం చేసిన తర్వాత వారంలో కనీసం రెండు సార్లు అయినా కొబ్బరి నూనె అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. తద్వారా స్ప్లిట్ ఎండ్‌ సమస్య రాదు. జుట్టు బలహీనంగా కూడా మారదు. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)