Jemimah Rodrigues Net Worth: జెమీమా రోడ్రిగ్స్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఈ స్టార్ ప్లేయర్ గ్రౌండ్‌లో తన ఆటతోనే కాదు.. సంపాదనలోనూ దుమ్ములేపుతోంది. 25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ నెట్‌వర్త్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5అయితే మైదానంలో తన ఆటతోనే కాదు.. బయట కూడా తన బ్రాండింగ్, సంపాదనతో కూడా జెమీమా రోడ్రిగ్స్ సంచలనం సృష్టిస్తోంది. జెమీమా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో బి గ్రేడ్‌లో ఉంది. దీంతో ఆమెకు సంవత్సరానికి బీసీసీఐ రూ. 30 లక్షలు జీతంగా ఇస్తుంది.
2/5ఇదే కాకుండా మ్యాచ్ ఫీజులు అదనం. ఒక్కొ టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల చొప్పున అందుకుంటుంది జెమీమా. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. జెమీమాను ఢిల్లీ 2.2 కోట్లకు రీటైన్ చేసుకుంది.
3/5హ్యుందాయ్, జిల్లెట్, రెడ్ బుల్, డ్రీమ్11, ప్లాటినం ఎవారా వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వివిధ నివేదికల అంచనా ప్రకారం 2025 నాటికి జెమీమా రోడ్రిగ్స్ నికర ఆస్తుల విలువ రూ. 8 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుంది.
4/5మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ దుమ్ములేపింది. ఆసీస్‌పై అజేయ శతకంతో చెలరేగి టీమిండియాకి విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో జెమీమా 134 బంతులు ఎదుర్కొంది. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె వీరోచిత సెంచరీ కారణంగా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.
5/5భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవంబర్ 2 న జరగనున్న ఈ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక కానుంది.