Add Zee Business As A Preferred Source
App

Jio: 50 కోట్ల మార్కు దాటిన జియో.. 9వ వార్షికోత్సవం వేళ యూజర్‌లకు బంపర్‌ ఆఫర్లు..!

Written ByRenuka Godugu
Published: Sep 04, 2025, 07:39 AM IST|Updated: Sep 04, 2025, 07:39 AM IST

Jio 9th Anniversary Offers: జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 9వ వార్షికోత్సవం భాగంగా రిలయన్స్ అపరిమిత డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తమ యూజర్లకు ప్రకటించింది. ఇది రూ.349 ప్లాన్ 12 నెలలు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరో నెల ఉచితంగా కూడా అందించనుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

Bumper Offer1/5

బంపర్ ఆఫర్లు

 50 కోట్ల మార్కు కూడా దాటిన జియో తమ యూజర్లకు 9వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రీఛార్జీ ఆధారంగా యూజర్లకు అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది. రూ. 349 ఆ పై ప్లాన్ యూజర్లకు ఈ ఆఫర్ అందించనుంది జియో.   

Rs 349 Plan2/5

 రూ.349 ప్లాన్

 రూ.349 ప్లాన్ తో రీఛార్జీ చేసుకున్న వాళ్ళు కంటిన్యూగా 12 నెలలు రీఛార్జీ చేసుకుంటే మరో నెల సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు ఉచితంగా ప్లాను అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబర్ 5 నుంచి 7 వీకెండ్ ప్లాన్ లో భాగంగా 5జి యూజర్‌లందరికీ ఎలాంటి రీఛార్జ్ లేకుండా అపరిమిత డేటా వాడుకోవచ్చు.   

4G Users3/5

4జి యూజర్లు

 అయితే 4జి యూజర్లు మాత్రం రూ.39 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు అపరిమిత డేటా పొందుతారు. జియో ఈ రూ.349 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రం జియో ఫైనాన్స్ ద్వారా 2% జియో గోల్డ్ కూడా పొందుతారు. రూ. 3000 రూపాయల ఉచిత ఓచర్‌ పొందుతారు.  

Jio Hotstar4/5

జీయో హాట్ స్టార్

ఇందులో ఒక నెలపాటు జీయో హాట్ స్టార్ సబ్‌స్క్రీప్షన్‌, జియో సావన్ ప్రో సబ్‌స్క్రీప్షన్‌ అపరిమిత కాలర్ ట్యూన్స్, మూడు నెలల జోమాటో గోల్డ్ సబ్‌స్క్రీప్షన్‌ 6 నెలల పాటు నెట్ మెడ్‌ సబ్‌స్క్రీప్షన్‌, 100% రిలయన్స్ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ స్పెషల్ డీల్స్ ఈజ్‌ మై ట్రిప్ ద్వారా ట్రావెల్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. జియో ప్రీపెయిడ్ మాత్రమే కాదు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ లభిస్తుంది  

9th Anniversary5/5

9వ వార్షికోత్సవం

9వ వార్షికోత్సవం వేల 50 కోట్ల మంది కస్టమర్లను కూడగట్టుకున్న జియో. ఈ ఆఫర్లను తమ వినియోగదారులకు ప్రకటించింది. ఈ మైల్‌స్టోన్‌కు చేరుకున్నందుకు ప్రతి ఒక్క జియో యూజర్ కి కృతజ్ఞతలు అని రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ చైర్మన్ ఆకాశ్‌ అంబాని అన్నారు.