Jio: చాలా చీప్ ధరలోనే జియో రీఛార్జీ ప్లాన్స్‌.. మూడు అద్భుతమైన ప్యాక్స్‌..

Jio Affordable Price: రిలయన్స్ జియో అది తక్కువ ధరలో రీఛార్జ్ ప్యాక్లను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి అద్భుతమైన ఫ్యాక్స్‌ గురించి తెలుసుకుందాం. వీటి ధరలు కేవలం రూ.189,  రూ.188  రూ.199 మాత్రమే కేవలం తక్కువ ధరతోనే ఇవి దూసుకెళ్తున్నాయి.
 

1 /5

2024 జులై నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత చాలామంది జియోని వదిలేసి బిఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని తిరిగి ఆకట్టుకునేందుకు జియో ప్లాన్స్ వేస్తోంది. అద్భుతమైన ప్లాన్స్‌ పరిచయం చేస్తోంది.  

2 /5

జియో రూ.189 ప్లాన్ టాప్ లిస్టులో ఉంది. ఎక్కువ శాతం మంది దీని ఉపయోగిస్తున్నారు. ఇందులో 28 రోజులపాటు వ్యాలిడిటీ అందుతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ 300 ఎస్ఎంఎస్ లు పొందుతారు.ఫెయిర్ యూసేజి పాలసీ (FUP) ప్రకారం జియో కస్టమర్లు జియో టీవీ, జియో కూడా పొందుతారు.  

3 /5

జియో రూ. 188 రీఛార్జ్ ప్లాన్ తో 100 ఎస్ఎంఎస్లు ప్రతిరోజు 2 జీబీ డేటా వస్తుంది. ఇందులో కూడా జియో టీవీ యాక్సెస్ ఉంటుంది. జియో ఈ ప్లాన్‌లో అపరిమిత 5జి డేటా కూడా పొందుతారు జియో టీవీ జియో ఏఐ క్లౌడ్ ఉచితం.  

4 /5

జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్ తో 14 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇందులో 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు 2gb డేటా జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ పొందుతారు. రూ. 200 లోపే అద్భుతమైన ప్లాన్ ఇది.  

5 /5

ఇక జియో రూ. 199 ప్లాన్ తో అపరిమిత 5జి డేటా పొందుతారు. ఇందులో 18 రోజుల వాలిడిటీ 1.5 జిబి డైలీ డేటాతో 100 ఎస్ఎంఎస్ లు ఉచితం పొందుతారు. కేవలం అతి తక్కువ ధరలోనే ఈ జియో ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.