Add Zee Business As A Preferred Source
App

Jio: ఐపీఎల్ వేళ జియో బంపర్ ప్లాన్.. 50 రోజుల వైఫై ఫ్రీ, మూడు నెలల హాట్ స్టార్ స్ట్రీమింగ్..

Written ByRenuka GoduguUpdated byRenuka Godugu
Published: Apr 17, 2025, 08:04 AM IST|Updated: Apr 17, 2025, 08:04 AM IST

Jio 3 months Plan: ఐపీఎల్ వేల జియో బంపర్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే రీఛార్జి ప్యాక్స్‌తోపాటు ఉచిత వైఫైలను కూడా అందిస్తోంది. దీంతో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

Reliance jio1/5

ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకోవస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేళ తాజాగా 50 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కూడా తీసుకోవచ్చింది. దీంతో జియో హాట్ స్టార్ కూడా ఉంది .  

ipl streaming2/5

 జియో హాట్ స్టార్ ఐపీఎల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.  దీనికి ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ జియో ప్లాన్ తో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కూడా ఉచితం. ఇది వినియోగదారులకు వినోదం కూడా అందిస్తోంది.   

Unlimited3/5

 50 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ లో కొత్తగా అన్లిమిటెడ్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. జియో అందిస్తున్న ఈ ప్లాన్ కేవలం రూ.299 మాత్రమే ఇందులో 5G సేవలు కూడా ఉన్నాయి. 90 రోజులపాటు వ్యాలిడిటీ అందిస్తుంది అంటే మూడు నెలల ఉచితం.  

Fiber Plan4/5

 జియో అందిస్తున్న ఫైబర్ ప్లాన్లలో తాజాగా 50 రోజుల ఉచిత వైఫై కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మీరు 4k జియో హాట్ స్టార్ ను వీక్షించవచ్చు. ఇది కాకుండా ఓటీటీలు కూడా అందుబాటులో ఉన్నాయి   

Jio Hotstar5/5

 800 కు పైగా టీవీ చానల్స్ తో పాటు 11 ఓటీటీలు, 50 రోజులపాటు ఉచిత వైఫై సేవలు పొందుతారు అయితే ఫ్రీ ఆఫర్ లేకున్నా రూ.100 తో జియో హాట్ స్టార్ 3 నెలలు ఉచితంగా ఆస్వాదించవచ్చు.