Jio: ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫ్రీగా చూసే అవకాశం.. కేవలం రూ.100 తో జియో బంపర్‌ ఆఫర్..

IPL Match Free With Jio Hotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ మొదలైంది. మార్చి 22 నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు జియో హాట్ స్టార్ లో ఉచితంగా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

పైసా ఖర్చు లేకుండా ఐపీఎల్ 2025 మ్యాచ్ చూడాలంటే కుదరదు. ఎందుకంటే కేవలం జియో హాట్ స్టార్‌లో మాత్రమే ఈ మ్యాచ్‌లు టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే మీరు కూడా ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ వీక్షించాలనుకుంటే ఒక ప్రీపెయిడ్‌ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే ఐపీఎల్ ఉచితంగా ఆస్వాదించవచ్చ.  

2 /5

అయితే దీనికి మీరు ఇప్పటికే ఒక జియో బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుని ఉండాలి. కేవలం రూ.100 ఖర్చు పెడితే సులభంగా మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ఈ వంద రూపాయలు రీఛార్జి ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటివి ఉండవు. జియో హాట్ స్టార్ 90 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. దీంతో పాటు 5gb డేటా ఉచితం.  

3 /5

అంతేకాదు జియో హాట్ స్టార్ మీ ప్రీపెయిడ్ ప్లాను ఎక్స్‌పైరీకి 48 గంటల ముందు ఈ ప్లాన్ తో మీరు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో నెల జియో హాట్ స్టార్ బెనిఫిట్ కూడా పొందుతారు.   

4 /5

ఇది కాకుండా రూ.195 తో జియో క్రికెట్ డేటా ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మీరు 15 జిబి మొబైల్ డేటాతో పాటు జియో హాట్ స్టార్ యాక్సెస్ 90 రోజులు పొందుతారు. కానీ ఈ ప్లాను ఇప్పటికే ఆల్రెడీ రీచార్జ్ చేసుకున్న వారికి వర్తించదు. ఎవరికైతే ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్స్ క్రిప్షన్, మొబైల్ డేటా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్లకి మాత్రమే ఈ ప్లాన్‌ వర్తిస్తుంది.  

5 /5

ఇక జియో హాట్ స్టార్ రూ.949 ప్రీ పెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజు పొందుతారు. ఇది కాకుండా ప్రతిరోజు 2gb డేటా, 84 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో కాంప్లిమెంటరీగా జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్, అదనంగా 5జి జియో క్లౌడ్ సేవలు కూడా పొందుతారు.