Reliance Jio: ధంతేరాస్, దీపావళికి ముందు రిలయన్స్ జియో.. తమ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. అత్యంత తక్కువ ధరకే జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జస్ట్ రూ. 349కే కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. గోల్డ్‌పై స్పెషల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ కొనుగోలుపై రోజువారీ డేటా, కాలింగ్‌తో సహా అనేక ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
1/5జియో రూ.349 ప్లాన్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. కస్టమర్లు అన్ని నెట్‌వర్క్‌లలో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMS పంపుకోవచ్చు.
2/5జియో ఫైనాన్స్‌పై గోల్డ్ బోనస్: జియోఫైనాన్స్ యాప్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ బోనస్. జియో గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే వినియోగదారులకు అదనంగా 2శాతం బోనస్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ కోసం వినియోగదారులు +91-8010000524కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమ పెట్టుబడిపై కొంచెం అదనపు రాబడిని పొందాలనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
3/5జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్స్: జియో స్మార్ట్ హోమ్ సెటప్ కోసం కంపెనీ జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్‌ను అందిస్తోంది. కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రయల్ సమయంలో వినియోగదారులు జియో హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజ్, ఓటీటీ కంటెంట్ వంటి సర్వీసులను యాక్సస్ చేయొచ్చు.
4/53 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్: ఎంటర్‌టైన్మెంట్ కోసం జియో 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పోర్ట్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌ల వంటి ప్రీమియం కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చు.
5/5జియోక్లౌడ్‌లో 50GB ఫ్రీ స్టోరేజీ: డిజిటల్ డేటా సేఫ్ కోసం జియో యూజర్ల కోసం 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. కస్టమర్లు తమ ఫైల్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.