Jockey Innerwear Special Story In Telugu: భారతదేశంలో జాకీ సక్సెస్ కావడానికి మూడు ఫార్ములాలను బాగా వినియోగించారు. దీనివల్ల 45 వేల కోట్ల కంపెనీగా ఎదిగింది. వారి వినియోగించిన ఫార్ములా లేంటో? జాకీ సక్సెస్ కావడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Jockey Innerwear Special Story In Telugu: అందరూ బహిరంగ ప్రదేశాల్లో సిగ్గుపడి కొనుగోలు చేస్తే వస్తువుల్లో ఇన్నర్‌వేర్‌లు ఒకటి.. పురుషులైతే డ్రాయర్లు, మహిళలైతే బ్రాలు డ్రాయర్లు ఎంతో సిగ్గుపడుతూ బహిరంగ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. షాపింగ్ మాల్స్ లలో వివిధ బ్రాండ్లకు సంబంధించిన ఇన్నర్ వేర్స్ విక్రయిస్తూ ఉంటారు. అయితే, భారత్‌లో ఇలాంటి ఉత్పత్తులను అమ్ముతూ వేలకోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత పేజ్ ఇండస్ట్రీస్ దక్కిందని భావించవచ్చు.
1/7పేజ్ ఇండస్ట్రీస్ సంబంధించిన జాకీ వివిధ ఉత్పత్తులను భారతదేశంలో సరఫరా చేస్తూ పెద్ద సంస్థగా ఎదిగింది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే ఏకంగా 45 వేల కోట్లకు పైగా మార్కెట్ విలువను సాధించిందంటే.. జాకీ భారత ప్రజల్లో ఎంత ప్రజాదరణ పొందిందో భావించవచ్చు. ఇలా ఈ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ జాకీ కంపెనీ వెనుకున్న ఆసక్తి పరిచయ కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2/7భారతదేశంలో ఇన్నర్‌వేర్ మార్కెట్ గతంలో చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా లోకల్‌కు సంబంధించిన కంపెనీలే తక్కువ నాణ్యతతో వీటిని ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించేవారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని 1973 సంవత్సరంలో జాకీ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయడం ప్రారంభించింది..
3/7అప్పట్లో ఫెరా (FERA) చట్టం అమలులోకి రావడం వల్ల జాకీ కంపెనీ 40 శాతం ఉత్పత్తులను తగ్గించుకోవలసి వచ్చింది. 1991 ప్రాంతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ప్రకటించడం వల్ల జాకీ కంపెనీకి మార్గం సుగమమైంది. 1994 సంవత్సరంలో జాకీ కి ప్రత్యేకమైన లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం అందించింది. అప్పటినుంచి జాకీ కి సంబంధించిన అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
4/7భారతదేశంలో జాకీ బిజినెస్ చేసుకున్నందుకు గాను ప్రభుత్వానికి ఐదు శాతం రాయల్టీ ఫీజును అమెరికాలో చెల్లిస్తూ ఉండేది. ఇప్పటికే స్థానికంగా ఉన్న బ్రాండ్లు తక్కువ ధరలకే నాణ్యతలేని ప్రొడక్ట్స్ ను విక్రయిస్తూ ఉండేవి.. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని సుందర్ గినామల్ జాకిని కొనగలిగే బ్రాండ్ గా కాకుండా.. కోరుకునే బ్రాండ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటినుంచి అసలైన ఆట ఆరంభమైంది.
5/7భారతదేశంలో జాకీ సక్సెస్ కావడానికి మూడు ఫార్ములాలను బాగా ఫాలో అయింది. అందులో మొదటిది బ్రాండింగ్.. జాకీ ప్రకటనల్లో భాగంగా ప్యాకేజింగ్లో కేవలం వెస్ట్రన్ స్టైల్‌ను మాత్రమే ఉపయోగించారు. ఈ ప్రకటనల్లో ఒక్క భారత సెలబ్రిటీని కూడా ఏమాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోలేకపోయారు.
6/7ఇక రెండవది ధరలు.. సాధారణంగా స్థానిక బ్రాండ్లకు సంబంధించిన అండర్వేర్లు కేవలం రూ.100 నుంచి 300 లోపే అందుబాటులో ఉండేవి. అయితే జాకీ మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ప్రీమియం క్లాత్‌ని కలిగిన డ్రాయర్లను కేవలం రూ.250 నుంచి రూ.300 లోపే విక్రయించేది.
7/7ఇక మూడవ సూత్రం ఏంటంటే మార్కెటింగ్.. అప్పట్లో భారతదేశానికి సంబంధించిన బ్రాండ్లు ఇన్నర్‌వేర్‌లకు సరైన మార్కెటింగ్ చేసేవారు కాదు. జాకీ కంపెనీ మాత్రం సాంప్రదాయం అడ్డంకులను బద్దలు కొట్టి మరి టీవీల్లో ప్రకటనలు చేయడం ప్రారంభించింది. అలాగే షాపింగ్ మాల్స్ లో కూడా ప్రత్యేకమైన కటౌట్స్ పెట్టి.. బ్రాండ్ ప్రమోషన్ చేసింది. దీనివల్ల మార్కెట్లో ఉత్పత్తులు విపరీతంగా అమ్ముడుపోయాయి.