Add Zee Business As A Preferred Source
App

Jr NTR: నావల్లే జూనియర్ ఎన్టీఆర్ బతికాడు.. లేకపోతే ఘోరమే.. స్టార్ నటుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు..

Written ByVishnupriya
Published: Sep 07, 2025, 10:24 PM IST|Updated: Sep 07, 2025, 10:24 PM IST

Jr NTR Shocking Incident : ప్రస్తుతం పాన్ ఇండియా పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న.. ఈ హీరో దేవరా చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ మధ్యనే వార్ 2 లో కూడా కనిపించి మెప్పించారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక తెలుగు స్టార్ నటుడు.. చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..

Star Comedian About JrNTR1/5

జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుత తరం హీరోల్లో డాన్స్ అయినా.. డైలాగ్ డెలివరీ అయిన.. మొదటి స్థానంలో నిలబడగలిగే హీరో ఎవరు అంటే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆయన నటనకు జోహార్లు కొట్టిన వాళ్లే. 

Jr NTR Accident2/5

జూనియర్ ఎన్టీఆర్

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి.

Srinivas Reddy About Jr NTR3/5

జూనియర్ ఎన్టీఆర్

అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్కి గతంలో 2009లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన వెనక వస్తున్న కారులో శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. 

Jr NTR Shocking Incident In Life4/5

జూనియర్ ఎన్టీఆర్

ఈ యాక్సిడెంట్ తర్వాత ఒక స్నేహితుడు శ్రీనివాసరెడ్డి తో నువ్వు పక్కనుండడం వల్లే ఇలా ఆక్సిడెంట్ జరిగింది అని తమాషాగా అన్నారంట. వెంటనే శ్రీనివాసరెడ్డి కూడా తమాషాగా సమాధానం ఇస్తూ..”నేను పక్కనున్నాను కాబట్టే అక్కడితో ఆగిపోయింది. లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది..”అని అన్నాడంట. 

Jr NTR Car Accident5/5

జూనియర్ ఎన్టీఆర్

కానీ ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్కి ఎలా చేరిందో తెలియదు కానీ.. వేరే విధంగా తన వల్లే జూనియర్ ఎన్టీఆర్ బతికారు అన్నట్లు కన్వే అయిందని.. అందుకే చాలా రోజులు తమ మధ్య దూరం పెరిగిందని. కానీ మళ్ళీ తారక్ ని కలిసినప్పుడు తను మామూలుగా మాట్లాడేసాడని చెప్పుకొచ్చారు.