Jubliee Hills By Election Result 2025: రేపు వైన్‌షాపులు బంద్‌.. కల్లు కంపౌండ్, బార్లు, వైన్స్‌ దుకాణాలు క్లోజ్‌..!

14 November 2025 Wine Shops Closed in Telangana: రేపు వైన్ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతంలో నిబంధన వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నియోజకవర్గంలోని అన్ని మందు షాపులు బంద్ ఉండనున్నాయి. బార్లు, కల్లు కాంపౌండ్‌లతో పాటు వైన్స్ షాపులకు కూడా ఇది వర్తిస్తుంది.

1 /5

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రేపు నియోజకవర్గంలోని అన్ని లిక్కర్ షాపులు బంద్ ఉండనున్నాయి. ఇది వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్‌లో కూడా వర్తిస్తుంది. నవంబర్ 11వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించారు.  

2 /5

ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు నవంబర్ 14వ తేదీ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కల్లు కంపౌండ్లు, వైన్స్‌, బర్లు కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు నుంచి సాయంత్రం వరకు బంద్‌ ఉండనున్నాయి.  

3 /5

 యూసఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందుకు ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓట్లు లెక్కింపు ముగిసే వరకు వైన్ షాపులు తెరచుకోవని కూడా అధికారులు నిర్ధారించారు.  

4 /5

 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవరగంలో ఉపఎన్నిక నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి స్థానిక నేత నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు.  

5 /5

 ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మొత్తం నాలుగు లక్షల 4,01365 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,08,561 మహిళలు 1,92,779 మంది ఉన్నారు ఇక 1,94, 631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి