Jubilee Hills By-Poll School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. స్కూళ్లకు రేపు సెలవుతో పాటు మంగళవారం నవంబర్ 11వ తేదీనా కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు వేతనంతో కూడిన సెలవు దినంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు? అది ఎక్కడెక్కడ? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
స్కూళ్లకు సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ అవుతుంది. నిత్యం హోం వర్క్, ఇతర ప్రాజెక్టు వర్క్‌లతో బిజీగా ఉండే విద్యార్థులకు ఇది కాస్త ఉపశమనంగా ఉంటుంది. చాలా వరకు స్కూళ్లు ఇప్పటికే రెండో శనివారం సెలవులు ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు. అయితే రేపు ఆదివారం నవంబర్ 9వ తేదీ సెలవు దినం ఉంది.
దీంతోపాటు మంగళవారం నవంబర్ 11వ తేదీ కూడా విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2025 నవంబర్ 11 మంగళవారం రోజున బై ఎలక్షన్ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సెలవు నియోజకవర్గ పరిధిలోని విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవులు రానున్నాయి.
సాధారణంగా ఎక్కువ శాతం ఓటింగ్ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఓటర్లు ఈ వెసులుబాటును వినియోగించుకుంటారు. నవంబర్ 11వ తేదీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ఎన్నికల బ్యాలెట్లు ఏర్పాటు చేస్తారు.
ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. జూబ్లీహిల్స్ పరిధిలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఈనెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఈ స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.