Lucky Zodiac Signs: మిధునంలో గురుడి సంచారం, మూడు రాశులకు వద్దంటే డబ్బు, మహర్దశ

Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల రాశి పరివర్తనం లేదా కదలిక రాశులపై ప్రభావం చూపిస్తుంది. అందుకే గ్రహాల కదలికను బట్టి జాతకం మారుతుంటుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. 

Lucky Zodiac Signs: బుధ గ్రహం గురు గ్రహంలో ప్రవేశించింది. దాంతో వివిధ రాశులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఆకశ్మిక ధనలాభం కలగనుంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే దశ మారిపోనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
 

1 /6

సింహ రాశి గురుగ్రహం రాశి పరివర్తనంతో సింహ రాశి జాతకులకు ఊహించని లాభాలు కలుగుతాయి. అనుకోని విధంగా సంపద లభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతన పెంపు ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు

2 /6

మకర రాశి మకర రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. జీవితంలో అన్ని సుఖాలు అందివస్తాయి. ఊహించని సంపద , కనకవర్షం కురవడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు.

3 /6

గురు గ్రహం ఈ ఏడాది మే నెలలో రాశి మారనుంది. మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో మూడు రాశులపై అమితమైన ప్రభావం పడనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో గణనీయమైన ప్రగతి కన్పిస్తుంది. వ్యాపారంలో అమితమైన లాభాలు కలుగుతాయి. ఏయే మూడు రాశులకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం

4 /6

వృషభ రాశిలో గురుగ్రహం గురు గ్రహం ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. మరో నెల రోజులు ఇదే రాశిలో ఉండి ఆ తరువాత బుధుడి రాశిగా పిల్చుకునే మిధునంలో ప్రవేశిస్తాడు. దాంతో చాలా రాశుల జాతకాలపై ప్రభావం పడుతుంది. 

5 /6

హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలన్నింటిలో శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు రెండున్నరేళ్ల సమయం తీసుకుంటుంది. ఆ తరువాత గురు గ్రహం కూడా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు 13 నెలల సమయం తీసుకుంటుంది

6 /6

మిధున రాశి గురు గ్రహం మిధున రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జాతకులకు చాలా ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. వ్యాపారులకు అమితమైన లాభాలు లభిస్తాయి. ఊహించని సంపద కలిసొస్తుంది. పెళ్లి జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం