Jupiter Transit Lucky Zodiac: జాతకంలో గురు బలం ఉంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అడుగుపెట్టిన ప్రతి చోట మంచి పేరు సంపాదిస్తారు. అంతే కాదు వీరికి ఆర్థిక లాభాలు కూడా బాగా ఉంటాయి.. వ్యాపారాలు విస్తరిస్తాయి విదేశీయానం కూడా ఉంటుంది. అయితే బృహస్పతి రాశి మార్పు కారణంగా మూడు రాశులకు బాగా కలిసి వస్తుంది. ఇందులో మీరాశి కూడా ఉందా?
జాతకంలో గురు బలం పెరగడం వల్ల మూడు రాశులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.
గురు గ్రహం రాశి మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అశేష ఫలితాలు కలిగిస్తాయి. ముఖ్యంగా వీరి వ్యాపారం విస్తరిస్తుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు అంతేకాదు వీరికి జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గురు బలం వల్ల మకర రాశి వారికి కూడా అశేష ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఎక్కువగా కలిసి వస్తాయి. పార్టీలకు వెళ్తారు.
వృషభ రాశి వారికి కూడా కెరీర్ లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త ఉద్యోగం దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. గురు బలం వల్ల సమాజంలో వీరి గౌరవం పొందుతుంది ఆరోగ్యం బాగుంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)