Hair Care: మనలో చాలా మంది జుట్టు ఊడిపోవడాన్ని చూసి బాధపడుతుంటారు. మార్కెట్లో ఎన్నో షాంపూలు, ఆయిల్‌లు ట్రై చేసినా పెద్దగా ఫలితం రాకపోతే ఇంట్లో దొరికే పెరుగు ఒక మంచి పరిష్కారం.
1/6కేవలం పది రూపాయల పెరుగు ప్యాకెట్‌తోనే జుట్టుకు అవసరమైన పోషకాలు అందించి, రాలిపోయే జుట్టుని ఆపొచ్చు. పెరుగులో విటమిన్ బి, కాల్షియం, ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి వెంట్రుకలను బలపరుస్తాయి.
2/6జుట్టును రూపుదిద్దేది కెరాటిన్ అనే ప్రోటీన్. పెరుగులో ఆ ప్రోటీన్ నిండుగా ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చుండ్రును తగ్గించడంలో సహాయం చేస్తుంది. జుట్టు మెరిసేలా, సున్నితంగా మారుతుంది.
3/61. చిన్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోండి. 2. నేరుగా తలపై, జుట్టు రూట్‌లపై బాగా రాయండి. 3. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 4. 30 నుంచి 40 నిమిషాలు వదిలేయండి. 5. గోరువెచ్చని నీటితో కడగండి.
4/62 స్పూన్ల పెరుగులో 1 స్పూన్ ఉసిరి పొడి లేదా తాజా పల్ప్
రెండు కలిపి తలపై రాసి 45 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. జుట్టు నల్లగా, బలంగా పెరుగుతుంది.
5/6ఈ ప్యాక్ పొడి జుట్టు ఉన్నవారికి ఉత్తమం. 2 స్పూన్ల కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. 3 స్పూన్ల పెరుగుతో కలపాలి. తలపై రాసి ఒక గంట తర్వాత కడగాలి. డ్రై హెయిర్‌కు వైద్యం లాంటిది.
6/6రోజుకి ఎక్కువ నీరు తాగాలి. పాలకూర, క్యారెట్, పప్పులు, గింజలు తరచూ తినాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎక్కువ కెమికల్ ఉత్పత్తులు దూరంగా పెట్టండి.