Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మ్యారేజ్ కు ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించిందో తాజాగా కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ‘సికందర్’ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హాట్ హాట్ గా క్లీవేజ్ అందాలతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.
కాజల్ అగర్వాల్.. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 18 యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస చిత్రాలతో అలరిస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సికందర్’ మూవీలో కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.
కాజల్ అగర్వాల్.. గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కాజల్ తను టైటిల్ రోల్లో పోషిస్తోన్న ‘సత్యభామ’ సినిమా కాజల్ అగర్వాల్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మొత్తంగా నెగిటివ్ షేర్ రాబట్టింది.
పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది కథానాయికలు మాత్రమే మ్యారేజ్ అయిన ఇప్పటికీ తన చిత్రాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’, ‘ది ఇండియా స్టోరీ’ సినిమాలున్నాయి. కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తే.. కాజల్ అగర్వాల్ పార్వతి మాత పాత్రలో కనిపించనుంంది.
కాజల్ అగర్వాల్ చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లింది.