Add Zee Business As A Preferred Source
App

Kalasarpa Dosha: నాగుల పంచమి పవర్‌ఫుల్ రెమిడీలు.. ఇలా చేస్తే కాలసర్ప దోషం, కుజదోషం నుంచి విముక్తి..

Published: Oct 25, 2025, 01:42 PM IST|Updated: Oct 25, 2025, 01:42 PM IST

Kalasarpa Dosha Remedies On Nagula Chavithi: నాగుల పంచమి రోజు కాలసర్ప దోషాలు ఉన్నవారు తప్పకుండా ఈ ఆదివారం కొన్ని రెమిడీలను పాటించి ఉపశమనం పొందండి. దీనికోసం తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడమే కాకుండా నాగదేవతను పూజించడం మంచిది. ఇలా చేయడం వల్ల సర్ప దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది..

Kalasarpa Dosha Remedies On Nagula Chavithi Telugu: హిందూ పురాణాల ప్రకారం నాగుల పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రతి ఏడాది శ్రావణమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీ ఆదివారం వచ్చింది. ముఖ్యంగా కుజదోషంతోపాటు కాలసర్ప దోషం ఉన్నవారికి ఈరోజు మరింత ప్రత్యేకమైనదని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రెమెడీలు చేయడం వల్ల కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందవచ్చని వారు అంటున్నారు. నిజానికి ఈ దోషం నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి రెమెడీలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Kala Sarpa Dosha After 33 Years1/5

కాలసర్ప దోషం

కాలసర్ప దోషం ఉన్నవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అలాగే మానసికంగా కూడా చాలా వరకు దెబ్బతింటారు. కొంతమంది అయితే ఎన్ని డబ్బులు సంపాదించిన అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.   

Kaal Sarp Puja Cost2/5

నాగుల పంచమి రోజున కాలసర్పదోషం నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా కొన్ని రెమెడీలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు తప్పకుండా తలస్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అలాగే ఆయనకు ఎరుపు రంగుతో కూడిన పూలతో ప్రత్యేకమైన పూజలు చేయాల్సి ఉంటుంది. 

Nagula Chavithi Pandaga3/5

ప్రత్యేకమైన అభిషేకం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పూలతో పూజలు చేసి ప్రత్యేకమైన అభిషేకం కూడా చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న  నాగదేవత ఆలయాన్ని సందర్శించి.. తప్పకుండా పుట్టలో పాముకి పాలు పోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాగదేవతకు పూజలు చేయాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. 

Nagula Chavithi 20254/5

నాగదేవతకు పూజ

వీలైనంతవరకు నాగదేవతకు పూజ చేసి ఉపవాసాలు పాటించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈరోజు ఎంతో నిష్టగా ఉండడం కూడా చాలా మంచిదని వారంటున్నారు. అయితే పూజలైన తర్వాత తప్పకుండా నాగదేవతకు సంబంధించిన ప్రత్యేకమైన స్తోత్రాన్ని చదవాల్సి ఉంటుంది. ఇక్కడ అందించిన స్తోత్రాన్ని నాగుల చవితి రోజు మీకు వీలున్న సమయంలో 50 నుంచి 60 సార్లు చదువుకోండి.   

Nagula Chavithi5/5

నాగదోషం

అలాగే నాగుల చవితి రోజు దోష నివారణ కోసం తప్పకుండా 5 మంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నాగదోషం నుంచి విముక్తి కలగడమే కాకుండా.. అన్ని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.