kamada Ekadashi 2024: కామద ఏకాదశి.. ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప రాజయోగం, పెళ్లి కుదిరే చాన్స్..

Fri, 19 Apr 2024-8:29 am,

కామదా ఏకాదశి. పేరులోనే కామద.. అంటే మనం ఎలాంటి కోరికలు కోరుకున్న ఆ విష్ణుభగవానుడు నెరవేరుస్తాడంట. అందుకే ఈ రోజున ఆ విష్ణుదేవుడికి కొన్ని ప్రత్యేకమైన విధానం ద్వారా పూజించాలని కూడా పండితులు చెబుతుంటారు. విష్ణుదేవుడు అలంకర ప్రియుడు. ఆయనకు పువ్వులు, తులసీ దళాలతో అర్చిస్తే ఎంతో ఆనందపడిపోతాడంట.

అందుకే ఈరోజున తులసీ దళాలు, తులసీ మాలలను చేసి, దాన్ని ఆయనకు మనసారా భక్తితో సమర్పించాలి. ఈరోజున ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో అలాంటి వారికి, వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన పుణ్యం వస్తుందంట. శుక్రవారం కూడా రావడం వల్ల కామద ఏకాదశి రోజు ఏపని చేసిన అధిక పుణ్యం వస్తుందంట.

విష్ణువుతో పాటు, అమ్మవారిని కూడా ప్రత్యేంగా పూజించాలంటా. ఈరోజు ఎర్రటి వస్త్రాలు ధరించి దేవుడ్ని పూజించాలి. పెళ్లికానీ వారు ముఖ్యంగా పసుపుతో, కుంకుమతో లలితా దేవీ పారాయణం చేయాలి. అదే విధంగా విష్ణువుకు కూడా నూటోక్క తులసీ దళాలతో పూజిస్తే పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు ఉన్న కూడా తొలగిపోతాయి.

కొందరికి ఎంతో కష్టపడ్డ కూడా జాబ్ లో గుర్తింపు, ప్రమోషన్ లు ఉండవు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈరోజున.. నల్లచీమలకు చక్కెర వేయాలి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ కాబట్టి పేదలకు తాగునీటి వసతులు కల్పించాలి. కుండలను దానం చేయాలి. పేదలకు వస్త్రదానం, స్వీట్లు ఇవ్వాలి.

అంతేకాకుండా.. ఈరోజున ఎవరైతే తమ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారో వారికి వచ్చే పుణ్యం గురించి ఎవరు కూడా చెప్పలేరు. వీరి ఇంట్లో దేనికి కూడా కొదువ ఉండదు. డబ్బులు ఇంట్లో ఎప్పుడు తాండవం చేస్తుంటాయి. నిత్య కళ్యాణం,పచ్చ తోరణం అన్న విధంగా ఉంటుంది. 

అందుకే  ఏకాదశి రోజున ఆ విష్ణుదేవుడిని తప్పుండా అర్చించాలి. కాలసర్పదోషాలున్న వారు ఈరోజున నాగదేవతకు ప్రత్యేకంగా పాలుపోయ్యడం, నాగ ప్రతిమకు పూలతో అలంకరణ చేయడం వంటివి చేయాలి.ఇలా చేస్తు ఉంటే జీవితంలో గొప్ప రాజయోగం కల్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link