Kantara chapter 1 First review: గత కొన్నేళ్లుగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరికొంత మంది మేకర్స్ మాత్రం. అంతుక ముందు జరిగిన స్టోరీల నేపథ్యంలో ప్రీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కొనసాగింపుగా కాంతార 1 సినిమా ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ రివ్యూ ఎలా ఉందనే విషయానికొస్తే..
1/6Kantara chapter 1 First review: మన దగ్గర కొంత మంది మాత్రమే అటు హీరోగా దర్శకులుగా రాణించివాళ్లున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ వంటి హీరోలు దర్శకులుగా సత్తా చూపెట్టారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి కూడా దర్శకుడుగా హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు. ఈయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజాగా ‘కాంతార ఛాప్టర్ 1’.
2/6కాంతార మూవీకి ప్రీక్వెల్ గా కాంతార ముందు ఏం జరిగిందనే స్టోరీ నేపథ్యంలో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పూర్తిగా జానపద నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు.
3/6అయితే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. తాజాగా ఈ సినిమాలో భయంకర యుద్ధ సన్నివేశాలు కారణంగా సెన్సార్ వాళ్లు UA సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ చిత్రాన్ని 16 యేళ్లు దాటిన పిల్లలు పెద్దల చూడాలనే నియమం పెట్టారు. ఇది ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఈ సినిమా కన్నడ నేటివిటీతో తెరకెక్కించారు.
4/6కాంతార మాదిరే ఇందులో రాణితో హీరో లవ్ ట్రాక్.. క్లెమాక్స్ లో బిగ్ ట్విస్ట్ ఈ సినిమాకు ప్లస్ అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రూ. 40 కోట్లు.. రాయలసీమలో రూ. 10 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. మొత్తంగా రూ. 90 కోట్ల రికార్డు బిజినెస్ చేసింది.
5/6‘కాంతార ఛాప్టర్ 1’ తెలుగులో హిట్ అందుకోవాలంటే రూ. 91 కోట్ల షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ రకంగా తెలుగులోనే రూ. 175 కోట్ల గ్రాస్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంపల్సరీ. ఎంత పెద్ద టాక్ వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. కేజీఎఫ్ 2 కూడా దాదాపు 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వార్ 2 ఎన్టీఆర్ వల్ల అంత బిజినెస్ చేసింది.
6/6మరి తెలుగులో కాంతార ఛాప్టర్ 1 చిత్రానికి ఆశించిన రేంజ్ లో బుకింగ్స్ లేవు. హిందీలో కూడా కాస్త డల్ గా ఉంది. ఉన్నంతలో కన్నడలో మంచి జోరు చూపిస్తోంది. మరి ఈ టార్గెట్ తో రిషబ్ శెట్టి తెలుగులో రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టి హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.