Snake Bite: పాము కాటు వేసిందా.?.. డోంట్ వర్రీ.. విరుగుడును కనిపెట్టిన సైంటిస్టులు..
కొన్నిసార్లు రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు కూడా చెట్ల మధ్యన పాములు కాటు వేస్తుంటాయి. ఇళ్లలో ఉపయోగించని సామానుల మధ్యలో కూడా ఇవి ఎలుకల కోసం వస్తాయి. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్లినప్పుడు మనల్నికాటు వేస్తాయి.
పాముఎవరినైన కాటేయగానే.. అది ఎలాంటి పాము డాక్టర్ కు చెబితే దానికి తగ్గట్టుగా యాంటీ వీనమ్ ఇస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం.. కాటేసిన పామును పట్టుకుని మరీ డాక్టర్ దగ్గరకు పెషెంట్లు వెళ్తున్నారు. కొన్నిసార్లు పాముకు విరుగుడు పనిచేయకపోవచ్చు.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) సైంటిస్టులు పాముకాటులో విడుదలయ్యే వెనమ్ ఆర్టిఫిషియల్ యాంటీబాడీని తయారు చేశారు.
సైంటిస్టులు తయారుచేసిన ఈ సింథటిక్ యాంటీబాడీ నాగుపాము, కట్లపాము,కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబాల విషాన్ని సైతం ఎదుర్కొంటుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని గుర్రాలు, గాడిదలలో టెస్ట్ చేసి చూస్తున్నారు.
అతి తొందరలోనే మానవులలో కూడా టెస్ట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో పాము కుడితే టెన్షన్ లేకుండా ఈ మందును తీసుకుంటే దాని కాటు నుంచి మన ప్రాణాలు కాపాడుకొవచ్చన్నమాట. ఈక్రమంలోనే సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం.
పాము కాటుతో మన దేశంలో ఎక్కడో ఒక చోట రైతులు చనిపోతున్నట్లు సమాచారం. దీని వల్ల కొందరు రైతులు పొలంలోకి వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. తాజాగా , బెంగళూరు సైంటిస్టుల పరిశోధనల పట్ల అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.