Add Zee Business As A Preferred Source
App

Karthika masam Usiri Deepam: కార్తీక మాసంలో ఉసిరి దీపదానం ఇస్తున్నారా..?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు..

Written ByInamdar Paresh
Published: Oct 30, 2025, 06:54 AM IST|Updated: Oct 30, 2025, 06:59 AM IST

Karthika masam 2025: కార్తీకమాసంలో చాలా మంది ఉసిరి దీపంను పండితులకు దానంగా ఇస్తారు. ముఖ్యంగా ఈ విధంగా దీపదానం ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతుంటారు.

Karthika masam:1/6

కార్తీక మాసం ఎఫెక్ట్:

దేశ మంతట ఎక్కడ చూసిన కూడా కార్తీక మాసం శోభ కన్పిస్తుంది. ముఖ్యంగా శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. కార్తీక  మాసం నేపథ్యంలో దీపారాధణ, నదీస్నానం, వనభోజనాలను చాలా మంది పాటిస్తారు.  

usiri deepam:2/6

కార్తీకమాసం పూజలు:

ఇతర మాసాల్లో కూడా కార్తీకంలో చేసిన పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు అధికమైన లాభాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు.

karthika masam:3/6

కార్తీక మాసం ఉసిరిదీపారాధన:

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు శివస్వరూపంగా అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగించడం, లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  

usiri deepam tradition:4/6

కార్తీక మాసం దీపారాధన:

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, సమస్త దరిద్రాలు తొలగిపోతాయని భక్తులు  విశ్వసిస్తారు. కార్తీకంలో దీపారాధన చేసేటప్పుడు.. స్టీల్ లేదా రాగి పాత్రలో బియ్యం తీసుకొవాలి. దాని మీద ఉసిరికాయ పెట్టి, దీపం వత్తి దాని మీద పెట్టి, పసుపు, కుంకుమ పెట్టాలి. తోచినంత సంభావన దాని మీద పెట్టి దీపం వెలిగించి పండితుడిని కార్తీక దామోదరుడి స్వరూపంగా భావించి దీపదానం ఇవ్వాలి.  

karthika masam:5/6

ఉసిరి దీపం:

ఇటీవల కొంత మంది ఉసిరిని మామిడి కాయ ఆకు లేదా ఇతర ఆకుల మీద పెట్టి ఉసిరికి కనీసం పసుపు,కుంకుమ కూడా అద్దకుండా దీపదానం ఇస్తున్నారు.  ఉసిరి కూడా చెడిపోయింది లేదా రంధ్రాలు ఉన్నది దానంగా ఇవ్వకూడదు.  

karthika masam festival:6/6

కార్తీక మాసం:

 దీపారాధన చేసే క్రమంలో ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  పండితులకు.. దానంగా ఇచ్చేవి ఏదో నామ మాత్రంగా కాకుండా.. మంచి మనసుతో,  మనం ఏవిధంగా ఇంట్లో తెచ్చుకుంటామో.. అలాంటివి దానంగా ఇవ్వాలి. దానం ఎలా చేస్తే అలాంటి ప్రతిఫలంమనకు లభిస్తుందని చెబుతుంటారు.