Add Zee Business As A Preferred Source
App

Katrina Kaif-Vicky Kaushal: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దగ్గర ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..?

Written ByAruna Maharaju
Published: Sep 24, 2025, 02:30 PM IST|Updated: Sep 26, 2025, 02:59 PM IST

Katrina Kaif-Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత దశాబ్ద కాలంగా బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో కత్రినా ఒకరు. ఇటీవల చావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విక్కీ. ఇక త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న ఈ జంట ఆస్తుల గురించి ప్రస్తుతం నెట్టింట్లో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.  వీరిద్దరి ఆస్తులు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

katrina kaif assets1/7

గర్భం దాల్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్‌న్యూస్‌ని వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Vicky kaushal Net worth2/7

కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ

ప్రస్తుతం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించే నెట్టింట్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరి ఆస్తులు, మూవీస్, పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే నివేదికల ప్రకారం కత్రీనా, విక్కీ ఆస్తుల విలువ సుమారు 265 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.   

katrina kaif net worth3/7

కత్రినా విక్కీ కౌశల్ ఆస్తులు

నివేదికల ప్రకారం విక్కీ ఆస్తులు దాదాపు రూ. 41 కోట్లు కాగా.. కత్రీనా ఆస్తులు రూ. 224 కోట్లు ఉంటాయని తెలుస్తోంది. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న సెలబ్రిటీల్లో కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ కూడా ఉన్నారు. 

katrina kaif pregnancy4/7

విక్కీ కౌశల్ ఆస్తులు

విక్కీ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. డంకీ సినిమాలో అతిథి పాత్రకు 12 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.   

katrina kaif5/7

కత్రినా కైఫ్ ఆస్తులు

విక్కీ కౌశల్ 2015లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. పెళ్లి తర్వాత కత్రీనా కైఫ్ చివరిగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాకు గాను 21 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంది. 

Vicky Kaushal6/7

విక్కీ కౌశల్

విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ 2021లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు. వీరి వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి క్యూ7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.  

Katrina Kaif Pregnancy News7/7

కత్రినా కైఫ్

ఇక పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కత్రినా కైఫ్.. చివరగా మెర్రీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. విక్కీ కౌశల్ మాత్రం ఈ ఏడాది ఛావా సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ మూవీ.. దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది.