Kavya Maran Boyfriend: ఆ స్టార్‌తో కావ్య పాప సీక్రెట్ లవ్.. మరోసారి కెమెరాకి అడ్డంగా చిక్కిన లవ్ బర్డ్స్

Kavya Maran-Anirudh Ravichander Relationship: హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య మార‌న్‌తో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌ ప్రేమ‌లో ఉన్నాడని.. కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్కబోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ జంట సీక్రెట్‌గా ఫారిన్ వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1 /5

అనిరుధ్‌, కావ్య మార‌న్ ఫారిన్‌లో సీక్రెట్‌గా షికార్లు చేస్తూ ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. దాంతో మ‌రోసారి వీరి ల‌వ్‌ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. అనిరుధ్‌, కావ్య మార‌న్ జంట‌గా ట్రిప్‌ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

2 /5

ఓ యూట్యూబ‌ర్ తీసిన వీడియోలో అనుకోకుండా ఈ జంట కెమెరాకి చిక్కింది. వీధుల్లో షికార్లు చేస్తుండ‌గా.. ఈ లవ్ బర్డ్స్ కెమెరాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

3 /5

వైరల్ ఫొటోలతో అనిరుధ్‌, కావ్య మార‌న్ పెళ్లి వార్త‌లు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జంటకి నెటిజ‌న్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లి క‌బురు వినిపించ‌డం ఒక్క‌టే మిగిలింద‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం సీక్రెట్ ల‌వ‌ర్స్ భ‌లే దొరికేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

4 /5

అనిరుధ్‌, కావ్య మార‌న్ ప్రేమాయ‌ణం గురించి ఇరువురి కుటుంబ‌ స‌భ్యుల‌కు తెలుసని.. పెద్ద‌ల అంగీకారంతోనే ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు సమాచారం. మరి ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాలంటే వాళ్లిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.  

5 /5

ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నా అనిరుధ్‌.. ద‌క్షిణాదిలోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు. మ‌రోవైపు ఐపీఎల్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు స‌హ య‌జ‌మానురాలిగా, ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది కావ్య మారన్. సోష‌ల్ మీడియాలో కావ్య పాపకి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.