Sunrisers Hyderabad Retention List Players List: వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. 2024 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ సీజన్‌లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేదు. హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఫలితంగా పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను రిలీజ్ చేసి.. పర్స్‌ను పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లను కచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
1/7ఐపీఎల్ 2025 మెగా వేలంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11.40 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్ములేపిన ఇషాన్.. ఆ తరువాత భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాడు.
2/7119 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 29.10 సగటు, 137.64 స్ట్రైక్ రేట్‌తో 2,998 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరుపున 14 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. IPL 2026 వేలానికి ముందు ఇషాన్‌ను విడుదల చేసేందుకు కావ్య మారన్ రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
3/7ఐపీఎల్ మెగా వేలానికి ముందు రూ.23 కోట్లకు హెన్రిచ్ క్లాసెన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో క్లాసెన్ పెద్దగా ఆకట్టులేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 487 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 49 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1480 పరుగులు చేశాడు. సగటు 40.00, స్ట్రైక్ రేట్ 169.72.
4/7ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడడం హెన్రిచ్ క్లాసెన్ స్టైల్.భారీ ధర, పర్ఫామెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని.. మినీ వేలానికి ముందు క్లాసెన్‌ను విడుదల చేసి మళ్లీ వేలంలో తక్కువ ధరకు తీసుకునే ఆలోచన చేయవచ్చు.
5/7టీమిండియా స్టార్ బౌలర్ హమ్మద్ షమీని మెగా వేలంలో 10 కోట్ల రూపాయలకు హైదరాబాద్ దక్కించుకుంది. అయితే షమీ అంచనాలను అందులేకపోయాడు. 11.23 ఎకానమీతో పరుగులు ఇచ్చి.. కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు.
6/7మహ్మద్ షమీ 119 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 133 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఎకానమీ రేటు 8.63 గా ఉంది. భారీ ధర కారణంగా మినీ వేలానికి ముందు టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
7/7స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను మెగా వేలంలో రూ.3.20 కోట్లు ఎస్ఆర్‌హెచ్ ఖర్చు చేసింది. ఈ సీజన్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడే అవకాశం రాగా.. అందులోనూ ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. రాహుల్ చాహర్ ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 7.72 ఎకానమీతో 75 వికెట్లు పడగొట్టాడు. మినీ వేలానికి ముందుకు రాహుల్ చాహర్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.