SRH Owner Kavya Maran Networth: క్రికెట్ అభిమానులను ఐపీఎల్ ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు (286)తో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. ఎస్‌ఆర్‌హెచ్ అనగానే భారీ స్కోర్లతో పాటు టీమ్ కావ్య మారన్ కూడా అందరికి గుర్తు వస్తారు. స్టేడియంలో ఆమె చేసే సందడి నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. కావ్య మారన్ ఆస్తుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ మ్యాచ్ ఉందంటే.. స్టేడియంలో అందరూ చూపు కచ్చితంగా కావ్య మారన్ వైపు ఉంటుంది. బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే ఆమె చేసే అల్లరి అంత ఇంత కాదు. చిన్న పిల్లలా మారిపోయే ఎగిరి గంతులేస్తుంది.
ఇక టీమ్ ఓడిపోయే పరిస్థితులు ఉంటే మాత్రం కావ్య పాపను చూసి అభిమానులు తెగ ఫీలవుతుంటారు. ఆమె తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓటమి బాధను చూపిస్తారు.
ఈ విషయం పక్కనబెడితే.. కావ్య మారన్ ఆస్తి విలువ రూ.400 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సన్ గ్రూప్ సామ్రాజ్యంలో భాగమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు సీఈఓగా ఉన్నారు. SA20, ఇతర మీడియా వెంచర్లలో కూడా ఆమెకు పార్టనర్‌షిప్ ఉంది.
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఈ గ్రూప్ సన్ టీవీ నెట్‌వర్క్, FM రేడియో స్టేషన్లు, వివిధ రకాల స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను కలిగి ఉంది.
కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూకేలోని ప్రతిష్టాత్మక వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA కంప్లీట్ చేశారు. ఇక్కడే ఆమె బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నారు.
ఐపీఎల్ వేలం నుంచి టీమ్‌లో ప్రతి విషయంలో కావ్య పాప వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ఐపీఎల్‌తో పాటు, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ లీగ్‌లో సన్ గ్రూప్ రూ.1,094 కోట్లతో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు చేయడంలో ఆమె కీ రోల్ ప్లే చేస్తున్నారు.
కేవలం 33 ఏళ్ల వయసులోనే కావ్య మారన్ తన టాలెంట్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఎస్‌ఆర్‌హెచ్ (IPL), సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SA20), నార్తర్న్ సూపర్‌చార్జర్స్ (ది హండ్రెడ్) యాజమానిగా వ్యవహరిస్తున్నారు.
సన్ టీవీ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సన్ మ్యూజిక్, FM ఛానెళ్లను పర్యవేక్షిస్తున్నారు.