Kavya Maran Latest News: సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం ఈ సారి రసవత్తరంగా సాగింది. కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SEC)కు ఈసారి కొత్త నాయకుడు వచ్చాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని టీమ్ బ్యాటింగ్ కోచ్ రస్సెల్ డొమింగో వెల్లడించారు. రెండుసార్లు SA20 విజేతగా నిలిపిన కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ స్థానంలో స్టబ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
1/5ఈసారి వేలంలో మార్క్‌రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ (DSG) రూ.7.05 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దీంతో మార్క్‌క్రమ్ ప్లేస్‌లో ట్రిస్టన్ సబ్స్‌కు ఎస్‌ఈసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
2/5సన్‌రైజర్స్‌లో సీనియర్లు క్వింటన్ డి కాక్, లూయిస్ గ్రెగొరీ, జానీ బెయిర్‌స్టో, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు ఉన్నా.. టీమ్ యాజమాన్యం మాత్రం ట్రిస్టన్ సబ్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది.
3/5మొదటి సీజన్ నుంచి స్టబ్స్ సన్‌రైజర్స్ తరుఫునే ఆడుతున్నాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అందుకే వేలానికి ముందు స్టబ్స్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది.
4/5SA20లో స్టబ్స్ 140.11 స్ట్రైక్ రేట్‌తో 723 రన్స్ చేశాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టోతో ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
5/5సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు: ట్రిస్టన్ స్టబ్స్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్‌కే, అన్రిచ్ నోకియా, జానీ బెయిర్‌స్టో, ఏఏమ్ గజన్‌ఫర్, ఆడమ్ మిల్నే, సెనురాన్ ముత్తుసామి, పాట్రిక్ క్రుగర్, లూథో సిపామ్లా, జోర్డాన్ హెర్మాన్, జేమ్స్ కోల్స్, క్రిస్ వుడ్, లూయిస్ గ్రెగొరీ, మిచెల్ వాన్ బ్యూరెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సీజే కింగ్, జేపీ కింగ్.