Keerthy Suresh Latest News: కీర్తిసురేష్ ఒకవైపు తన భర్తతో వెకెషన్ లు ఎంజాయ్ చేస్తునే, మరోవైపు మూవీస్ లలో బిజీగా ఉంటుంది. ఆమె చేసిన తాజాగా చేసిన ట్విట్ తో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తొంది.
కీర్తిసురేష్ ప్రస్తుతం చేసిన ట్విట్ తో ఒక్కసారిగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పెళ్లైన అతి తక్కువ టైమ్ లో మహానటి చేసిన ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
నేను శైలజా అనే మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. మహానటితో ఒక రేంజ్లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో తన నటనతో కీర్తి సురేష్ భారీగా అభిమానుల్ని సొంతం చేసుకుంది.
ఈ నటి తెలుగు, తమిళం, మలయాళం మూవీస్ లలో నటిస్తు బిజీగా ఉంటుంది. అదే విధంగా వరుణ్ ధావన్ తో.. బేబీజాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే..ఈ సినిమా అనుకున్నంత హిట్ ను సొంతం చేసుకొలేదు.
గతేడాది డిసెంబరు 12న కీర్తిసురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకుంది. గోవాలో వీరి పెళ్లి హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల్లోజరిగింది. పెళ్లి తర్వాత కూడా ఈ నటి ఈ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మంగళ సూత్రంలోనే బేబీజాన్ ప్రమోషన్ లలో పాల్గొంది. అయితే.. నటి ఆంటోనీ తట్టిల్ తో వెకెషన్ పిక్స్ ను తరచుగా పంచుకుంటుంది.
అయితే.. తాజాగా.. కీర్తిసురేష్.. తమిళంలో యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో మూవీకి ఓకే చెప్పింది. ఈ సినిమాను..గుడ్ నైట్, లవర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. మరోవైపు కీర్తిసురేష్.. ఇంకా.. కన్నేవేడి, రివాల్వర్ రీటాలలో నటిస్తుంది.
ఈ మూవీచేస్తున్నట్లు తాజాగా.. నటి తన చేసిన ట్విట్ వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు మరోసారి పండగ చేసుకుంటున్నారు. మహానటికి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.