Add Zee Business As A Preferred Source
App

Keerthy Suresh Net Worth: కీర్తి సురేశ్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..! ఎన్ని వందల కోట్లు అంటే..

Written ByTA Kiran Kumar
Published: Sep 15, 2025, 12:10 PM IST|Updated: Sep 15, 2025, 12:10 PM IST

Keerthy Suresh Net Worth: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక హీరోయిన్ గా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్నప్పటి బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ఇక పెళ్లి తర్వాత  ఈమె ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగింది. 

Keerthy Suresh Net Worth1/6

కీర్తి సురేష్ నెట్ వర్త్

Keerthy Suresh Net Worth: కీర్తి సురేష్ కేవలం మలయాళీ భామ అయినా.. తెలుగు సహా ఇతర భాషల్లో ఈమె క్రేజ్ ఉంది.  కేవలం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో కీర్తి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగానే.. ఆంటోని తట్టల్ ను గోవాలో డిసెంబర్ 12న హిందూ సంప్రదాయంలో  ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత క్రిష్టియన్ సంప్రాదయంతో కూడా వీరి మ్యారేజ్ జరిగింది. 

Keerthy Parents 2/6

కీర్తి పేరేంట్స్

కీర్తి సురేశ్ తల్లి దండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో ఆమె అడుగులు సహజంగా సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లాయి. బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి ఆపై హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతకాదు ‘మహానటి’ సినిమాలోని నటనకు జాతీయ చలన చిత్ర అవార్డు అందుకోవడం విశేషం. 

Kalki 2898 AD 3/6

కల్కి 2898 AD

కీర్తి.. లాస్ట్ ఇయర్  రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో  తెరకెక్కిన  ‘కల్కి 2898 AD’ చిత్రంలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తీసుకొచ్చింది కీర్తి సురేశ్. ఈ చిత్రంలో కారు పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉండటం విశేషం. అటు బేబి జాన్, రఘుతాత సినిమాలతో పలకరించింది. 

Keerthy Suresh Movies 4/6

కీర్తి సురేష్ మూవీస్

ఈ యేడాది కీర్తి సురేష్.. ‘ఉప్పుకప్పురంబు’ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలో ‘రివాల్వర్ రీటా’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

Keerthy Suresh Assets 5/6

కీర్తి సురేష్ ఆస్తులు

కీర్తి సురేష్ కు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులతో పాటు తన యాక్టింగ్ ద్వారా బాగానే కూడబెట్టింది. ఈమెకు సొంత రాష్ట్రం కేరళలోని కొచ్చి, త్రివేండ్రంతో పూర్వీకుల ఇళ్లతో పాటు పెద్ద బంగళా ఉంది. టు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఓ అపార్ట్ మెంట్ ఉంది.  చెన్నైలో పలు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు రూ.500 కోట్లకు పైగానే ఉంటుందట.

Keerthy Suresh Husband assets 6/6

కీర్తి భర్త ఆస్తులు

 

భర్త ఆంటోని తట్టిల్ విషయానికొస్తే.. ఇతనికో దుబాయిలో పలు బిజినెస్ లున్నాయి. ఇతని వర్త్ రూ. 1000 కోట్ల వరకు ఉంటుందట. మొత్తంగా కీర్తి సురేష్ కు రూ. 1500 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం.