Kerala Floods Havoc: విధ్వంసం సృష్టించిన కేరళ వరద దృశ్యాలు

Sun, 17 Oct 2021-2:39 pm,

వర్షాల నేపధ్యలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 19 వరకూ శబరిమల పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు.

వాస్తవానికి కేరళలో రేపట్నించి కళాశాలలు తెరవాలని అనుకున్నారు కానీ అనూహ్యంగా వర్షాలు విరుచుకుపడటంతో వాయిదా పడింది. అక్టోబర్ 20 తరువాతే కళాశాలల్ని తెరుస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. పలువురు గల్లంతయ్యారు. కొట్టాయంలో ఐదు ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, వరద నేపధ్యంలో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి.

వరదలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచి..ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించినట్టు తెలుస్తోంది. 2018లో వచ్చిన వరద విలయాన్ని మర్చిపోకముందే..కేరళపై మరోసారి వరుణుడు పగబట్టాడు. 

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వరద నీరు పోటెత్తింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లన్నీ సరస్సులుగా మారిపోయాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link