Kerala style Tasty Coconut Chutney: రుచికరమైన కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు?. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే ఈ చట్నీ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, శనగపప్పు వేసి తయారు చేసుకుంటారు. దీన్ని మెత్తని పేస్ట్ మాదిరి చట్నీ తయారు చేసుకుంటే ఉదయం అదిరిపోయే టిఫిన్ కి రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుంది. అయితే ఈ కొబ్బరి చట్నీ మనం హోటల్ స్టైల్ లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. అది ఎలా తెలుసుకుందాం..
1/5కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది. దీనికి తాలింపు వేసి అందులో ఇంగువ వేస్తే ఆ రుచి, సువాసన అదుర్స్. ఉదయం టిఫిన్ లోకి ఏ చట్నీ చేయాలని కంగారు పడకుండా హాయిగా కొబ్బరి చట్నీ తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ లోనే ఇంట్లోనే ఇడ్లీ, దోశ, వడల్లోకి అదిరిపోయే కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
2/5కావలసిన పదార్థాలు.. కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి పచ్చి కొబ్బరి తురమండి. అందులో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, అర కప్పు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
3/5మీరు పేస్టు చేస్తున్న సమయంలోనే నీళ్లు కూడా ఎంత కావాలో చూసుకొని మెత్తగా రుబ్బండి. అయితే ఇందులోకి మీకు క్రీమి టెక్చర్ రావాలంటే కాస్త పెరుగు కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టండి.
4/5పలుచగా కావాలంటే ఇందులో మీరు నీళ్లు కలపవచ్చు. అయితే దీనిపై మనం తాలింపు కూడా వేసుకోవాలి. దీనికి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అర స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇంగువ వేసి చిటపటలాడించండి.
5/5ఇప్పుడు తాలింపు నుంచి మంచి అరోమా వస్తుంది. ఈ వేడి వేడి తాలింపు చట్నీలో వేసుకొని కలిపేయాలి. అంతే కేరళ స్టైల్ అదిరిపోయే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు తాజాగా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాలలో వేసుకుని తినవచ్చు. ఫ్రిజ్‌లో ఆరు గంటల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.