Khairatabad Ganesh 2025 Immersion Photos: దేశంలోనే అత్యంత వైభవంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యింది. భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కళ్లు చెదిరే ఆ దృశ్యాలు చూసేయండి.
1/10Khairatabad Ganesh 2025 Photos: జై బోలో గణేష్ మహారాజ్‌కు.. గణపతి బొప్పా మోరియా.. అంటూ హైదరాబాద్ నగరం మార్మోగుతోంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరిపోయాడు.
2/10ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ట్యాంక్‌బండ్ మీదుగా హుస్సేన్‌సాగర్ చేరుకుంది.
3/10ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రలో భక్తులు ఆటాపాటలతో అలరించారు. డీజే పాటలు, భక్తి గీతాలు, కళాకారుల ఆటపాటలతో శోభాయమానంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగింది. ఈ యాత్ర చూడడానికి రెండు కళ్లు చాలలేదు.
4/10దేశంలోనే అతిపెద్ద వినాయకుడి ఊరేగింపు కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేలా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది.
5/10మహా గణపతి శోభాయాత్రను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణతోపాటు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాదాపు లక్ష మంది ఈ యాత్రలో పాల్గొనట్లు తెలుస్తోంది.
6/10ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర చూడడానికి రెండు కళ్లు చాలలేదు. వైభవంగా సాగిన శోభాయాత్ర నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
7/10ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన బాహుబలి క్రేన్ వద్ద వినాయకుడు చేరుకున్నాడు. ఆఖరి పూజ చేసిన అనంతరం వినాయకుడిని నీటిలో వదిలారు. ఈసారి వినాయకుడు పూర్తిగా నీటిలో మునిగిపోవడం విశేషం.
8/10ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సాఫీగా జరగడంతో పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది. జీహెచ్‌ఎంసీ, ఇతర భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా పలు ఆంక్షలు విధించారు.
9/10ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగియడంతో పాతబస్తీ నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం పాతబస్తీ నుంచి ట్యాంక్‌బండ్‌కు శోభాయాత్ర ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి.
10/10వెళ్లి రావయ్య! గణపయ్య.. ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించవయ్య. మళ్లీ వచ్చే ఏడాది కలుసుకుందామయ్య.. బై బై గణేశా From Zee Telugu News