Leaf Tea For Weight Loss: మన వంటగదిలో ఉండే అనేక పదార్థాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వాటిల్లో అజ్వైన్.. అనగా వాముపొడి లేకపోతే వాము ఆకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎక్కువగా మనం వాము గింజలను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ ఆకుల్లో కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకు టీ.. తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
1/7వాము అనగా అజ్వైన్ ఆకులతో తయారయ్యే టీ.. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత మంచిదని ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ టీ శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడమే కాదు, మైగ్రేన్, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారంగా ఉంటుంది.
2/71. కొద్దిగా తాజా అజ్వైన్ ఆకులు తీసుకోవాలి. 2. వాటిని బాగా నూరాలి లేదా మిక్సీలో గ్రైండ్ చేయాలి. 3. అందులో వచ్చిన రసం ఒక చిన్న పాత్రలో వేయాలి. 4. కొంచెం అల్లం రసం, కొంచెం మిరియాల పొడి కలపాలి. 5. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు మరిగించి టీలా తయారు చేసుకోవాలి. 6. వారం లో రెండు సార్లు తాగితే చాలు.
3/7ఈ టీ శరీరంలో మెటాబాలిజంను పెంచుతుంది. దాంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. కొన్ని రోజుల నుండే బరువు తగ్గుతున్నట్లు మనకు తెలుస్తుంది.
4/7తలనొప్పి లేదా మైగ్రేన్ బాధపడే వారికి ఈ టీ చాలా చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది. మస్తిష్కాన్ని శాంతపరుస్తుంది.
5/7ఈ టీ తాగితే నెమ్మదిగా మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ టీ కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది. కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో.. కూడా మంచి పాత్ర పోషిస్తుంది.
6/7జీర్ణ వ్యవస్థకు మంచిది పేగుల్లో గాలి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉంటే ఈ టీ తాగడం ద్వారా త్వరగా సర్దుతుంది.
7/7ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిదైనా, ఏదైనా అనారోగ్య సమస్య ఉందా లేదా మందులు తీసుకుంటున్నారా అంటే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.