Vahana Mitra Scheme Online Apply: ఏపీలో కూటమి సర్కారు ఆటో, డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేయగా.. అర్హులైన వారి నుంచి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా..
1/7రూ.15 వేల ఆర్థిక సాయం పొందాలంటే ఆటో, డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ తీసుకుని.. మీ వివరాలతోపాటు బ్యాంక్ వివరాలు, ఇన్‌కమ్ సర్టిఫికెట్ నంబరు, వాహనానికి సంబంధించిన వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
2/7క్యాబ్‌లు డ్రైవర్లకు RC, ఫిట్‌నెస్, వాహన పన్ను తప్పనిసరిగా ఇవ్వాలి. పత్రాలు చెల్లుబాటు అయ్యేవి/అమలులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి తనిఖీ చేసుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలనలో చెల్లుబాటుకాకపోతే మీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
3/7ఆటో డ్రైవర్లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఈ సంవత్సరానికి మినహాయింపు ఇచ్చారు. ఒక నెలలోపు తీసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ ట్యాక్స్ అవసరం లేదు. RC తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
4/7ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నెల 22వ తేదీలోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. అనంతరం సెప్టెంబర్ 24వ తేదీ నాటికి తుది జాబితా సిద్ధం అవుతుంది.
5/7దరఖాస్తు దారులకు రేషన్ కార్డు ఉండాలి.. లేదా బీపీఎల్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి అయినా.. పెన్షనర్ అయినా ఈ స్కీమ్‌కు అనర్హులు. పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
6/7విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. గత 12 నెలల సగటు తీసుకుని లెక్కిస్తారు. పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉంటే క్లియర్ చేసుకోండి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రెండు కలిపుకుంటే.. 10 ఎకరాలలోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉంటే.. 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉంటే అనర్హులు అవుతారు.
7/7అక్టోబర్ 1వ తేదీన దసరా కానుకగా.. ఒక్కొ లబ్ధిదారుడి ఖాతాలో రూ.15000 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులైన వారు ఇవాళ్టి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.