PPF Interest Rate 2025: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. అందుకే చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న సమయంలోనే రిటైర్మెంట్ తర్వాత ఎలా అనే సందేహంతో ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. నెల నెలా స్థిరమైన ఆదాయం కావాలని కోరుకుంటారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ప్రతినెల నెలా స్థిరమైన ఆదాయం రావాలంటే ఏ స్కీమ్ భద్రంగా, లాభాదాయకంగా ఉంటుందోననే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, పూర్తిగా ప్రభుత్వ భరోసాతో ఉన్న పెట్టుబడి స్కీమ్ కోసం సెర్స్ చేస్తున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
పీపీఎఫ్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దీర్ఘకాలిక సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ పూర్తి భద్రతమైన పెట్టుబడి మార్గంగా ఉంది. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు, దానిపై వచ్చే మొత్తం వడ్డీ, చివరగా మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం.. వీటన్నింటికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన పని ఉండదు. అంటే ఎంత డబ్బు పెట్టుబడి పెట్టినా దానిపై వచ్చి లాభం పూర్తిగా మీ సొంతం అవుతుంది.
అయితే పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయాలంటే భారతీయులై ఉండాలి. పిల్లల కోసం మైనర్ ఖాతా కూడా తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి ఒకే అకౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు అయితే ఇద్దరు వేరువేరు అకౌంట్లు తీసుకుంటే ఆ కుటుంబానికి డబుల్ టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ కు ప్రభుత్వం 7. 1శాతం వడ్డీ రేటు అందిస్తుండగా.. దీనిని కాంపౌండ్ వడ్డీగా లెక్కిస్తారు. దీని అర్థం మీరు పొందిన వడ్డీ కూడా మళ్లీ వడ్డీని సంపాదిస్తుంది. ఈ స్కీమ్ 15ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. అయితే దీన్ని 5ఏళ్ల చొప్పున మరింతగా పొడిగించుకోవచ్చు.
ప్రతిఏడాది కనీసంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా ఇన్వెస్ట్ చేస్తే..కుటుంబ స్థాయిలో రూ. 3లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ప్రతి ఏడాది రూ. 1.5లక్షల చొప్పున 15ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తే చివరి సుమారు రూ. 40.6లక్షల వరకు లాభం వస్తుంది. దీనిలో దాదాపు రూ. 18లక్షల వరకు కేవలం వడ్డీ రూపంలోనే వస్తుంది. ఈ మొత్తానికి టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అయితే ఈ స్కీములో మరో ప్రత్యేకమైన సౌకర్యం ఉంది. Extension Without Contribution..అంటే 15ఏళ్ల తర్వాత మీరు కొత్తగా డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండానే అకౌంట్ ను రన్ చేయవచ్చు. మీ అకౌంట్లో ఉన్న మొత్తంపై వడ్డీ మాత్రం వస్తుంది. మీ అకౌంట్లో రూ. 40లక్షలు ఉంటే.. కొత్తగా పెట్టుబడి పెట్టకుండానే ప్రతి ఏడాది రూ. 2.8లక్షల వడ్డీ పొందవచ్చు.
అందుకే పీపీఎఫ్ అనేది సాధారణ సేవింగ్స్ స్కీమ్ కాదనే చెప్పాలి. ఇది భద్రమైన, టాక్స్ ఫ్రీ, జీవితాంతం ఆదాయం ఇచ్చే స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్ అనే చెప్పాలి. మీరు ఇప్పుడు మొదలు పెడితే.. భవిష్యత్తులో ఆర్థిక భరోసా, వడ్డీలాభం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వనీ ఒకే పెట్టుబడిలో పొందే ఛాన్స్ ఉంటుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.